రేపాక గ్రామంలో ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన వైస్ చైర్మన్ నర్సిరెడ్డి ఏపివో వెంకటేశ్వర్లు

అడ్డగూడూరు 06 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని డి రేపాక గ్రామంలో ఐకెపి సెంటర్ ను మోత్కూర్ మార్కెట్ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి ఏపీవో వెంకటేశ్వర్లు మహిళా మండలి సమాఖ్య అధ్యక్షురాలు అల్లే కల్పన ప్రారంభించారు. వైస్ చైర్మన్ నర్సిరెడ్డి మాట్లాడుతూ..రైతులు దలార్ల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. రైతులు ధాన్యాన్ని మంచిగా ఎండబెట్టిన తర్వాతే కాంటాలకు వెయ్యాలని ఉండకపోతే తేమ వచ్చి ధాన్యం మొత్తం కలర్ గా మారి ధాన్యం కల్తీ అయితదని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు,మహిళా, గ్రామస్తులు నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.