రేపటితో దశాబ్దాల కల నిజమైపోతుంది

తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం
ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సొజు నరేష్
తిరుమలగిరి 14 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల ప్రజల దశాబ్దాల కల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం కానున్నదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్సోజు నరేష్ మాట్లాడుతూ 78వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల గురువారం రోజున ఉదయం 9 గంటలకు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల సాధకులు శాసనసభ్యులు మందుల సామెల్ ప్రారంభిస్తారు. ఈ యొక్క శుభ కార్యక్రమానికి పార్టీలకతీతంగా మండలంలోని అన్ని అధ్యక్షులు నాయకులు విద్యార్థి యువజన సంఘాల నాయకులు గ్రామ పెద్దలు కుల సంఘాల నాయకులు స్వచ్ఛంద సేవ సంస్థ నాయకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ చాగంటి అనసూయ రాములు మాజీ మార్కెట్ చైర్మన్ మూల అశోక్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరాల వీరేష్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమీలాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరి జనార్ధన్ మూల రవీందర్ రెడ్డి కౌన్సిలర్లు బత్తుల శ్రీను సుధాకర్ నాయిని కృష్ణ నాగరాజు బానోత్ భాస్కర్ మండల కాంగ్రెస్ నాయకులు కిష్ట నాయక్ రవీందర్ నాయక్ మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు దేవేందర్ రషీద్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.