రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ఉద్యోగొన్నతి. శుభాకాంక్షలు తెలిపిన ఎస్పి.
ప్రమోషన్‌తో బాధ్యత మరింత పెరుగుతుంది – జిల్లా ఎస్పీ నరసింహ .
జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ నందు అర్ఎస్ఐ లుగా విధులు నిర్వర్తిస్తున్న టి. రాజశేఖర్, కె. అశోక్ లు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ఉద్యోగోన్నతి పొందినారు. ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన అధికారులు ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నరసింహ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ ప్రమోషన్ పొందిన ఇరువురిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి స్టార్స్ ధరింపజేసి ప్రమోషన్ ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రమోషన్‌తో హోదా పెరగడంతో పాటు బాధ్యత కూడా మరింత పెరుగుతుందని, పోలీస్ శాఖకు అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.. రాజశేఖర్,. అశోక్‌లు జిల్లాలో ఆర్ఎస్ఐలుగా విలువైన సేవలు అందించారని, వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్ఐ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.