రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది పిఓడబ్ల్యు

Jul 15, 2024 - 20:23
Jul 15, 2024 - 21:20
 0  3
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది పిఓడబ్ల్యు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది పిఓడబ్ల్యు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేపడుతున్న ద్వంద విధానాలతో దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ లేకుండా పోతుందని పి ఓ డబ్ల్యు జిల్లా నాయకురాలు గుణగంటి నీలమ్మ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పిఓడబ్ల్యూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు

 ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్త్రీలు అభద్రతాభావానికి గురవుతున్నారని అన్నారు స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న విధానాలతో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప హక్కుల కోసం మాట్లాడటం లేదని అన్నారు దేశంలో అర్ధరాత్రి కాదు పగలు కూడా మహిళలు ఒంటరిగా తిరిగే పరిస్థితి లేదని ఎక్కడ చూసినా అఘాయిత్యాలు యాసిడ్ దాడులు జరుగుతున్నాయని వాటి నివారించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి అన్నారు ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు నాయకులు బట్టిపెల్లి లక్ష్మమ్మ రేణుక సావిత్ర మంజుల ఆదమ్మ ఉప్పమ్మ. ఇజ్జమ్మ, లింగమ్మ కమలమ్మ తదితరులు పాల్గొన్నారు