రామాలయ కాలనీలో విషసర్పాల బీభత్సం

Jul 24, 2026 - 21:43
 0  2
రామాలయ కాలనీలో విషసర్పాల బీభత్సం

 ప్రాణాలు గుప్పెట్లో!"కాలనీ వాసులు.
. జోగులాంబ గద్వాల 24 జులై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : సరైన వీధి దీపాలు, చెత్త సేకరణ లేకవిష సర్పల వల్ల ప్రాణహాని తప్పదు అంటూ గ్రామస్తుల ఆవేదన చేందుతున్న పరిస్థితిజోగులాంబ గద్వాల్ జిల్లా 
కొత్త రాజోలి గ్రామస్తుల లో కనిపించడం జరిగింది 
కొత్త రాజోలి గ్రామం, శ్రీరాములవారి టెంపుల్ కాలనీ లో ఇండ్ల ఆవరణల్లోకి విషసర్పాలు వచ్చి సంచరిస్తున్నాయి. దీంతో ఆడవారు, పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
సమస్యకు కారణం ఏమిటి?  
1.  వెలుతురు లేకపోవడం: కొత్త గ్రామంలో కరెంటు స్తంభాలు చాలా దూరం దూరంగా ఉన్నాయి. వేసినవి కూడా చిన్న బల్బులే. రాత్రి అయ్యేసరికి చీకటి ముసురుతుంది. పాములు ఇండ్లలోకి రావడానికి ఇదే ప్రధాన కారణం.
2.  పారిశుధ్యం లేకపోవడం: చెత్త సేకరణ బండి ప్రతి రోజు రావడం లేదు. చెత్త పోగుపడటం వల్ల ఎలుకలు, పాములు ఎక్కువగా వస్తున్నాయి.
3.  ప్రాణాలకు ముప్పు: చీకట్లో కాలు పెట్టాలంటేనే భయం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ప్రజలు గుండెల్లో దడతో బతుకుతున్నారు వెంటనే పరిష్కారం కావాలి
గ్రామ మండల మరియు పాలకవర్గ ప్రజా ప్రతినిధులకు విన్నపం. దయచేసి ఈ విషయంపై తక్షణమే స్పందించండి.  
1. వీధి దీపాలు: ఉన్న చిన్న బల్బులు తీసేసి, ఎల్ ఈ డి పెద్ద లైట్లు వేసి ప్రతి 30 అడుగులకు ఒకటి ఉండేలా ఏర్పాటు చేయాలి.  
2. చెత్త సేకరణ: చెత్త బండి రోజూ వచ్చేలా చూడాలి. కాలనీని శుభ్రం చేయాలి.
గ్రామ అభివృద్ధి కోసం కొత్త వారిని గెలిపిస్తే, గతంలో కన్నా కొత్త గ్రామంలోని కాలనీలు మరింత అభివృద్ధికి నోచుకోకుండా మరుగున పడిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఏదో ఒక రోజు ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది.

దయచేసి మా ప్రాణాలను కాపాడండి. వెంటనే చర్యలు తీసుకోగలరు.
కొత్త రాజోలి కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333