రాత్రివేళల్లో చెరువు మట్టి దందా

May 3, 2025 - 19:02
 0  7

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ రాత్రివేళల్లో చెరువు మట్టి దందా* అధికారులు అండతోనే మట్టి తరలిస్తున్నారు అంటూ స్థానికులు ఆరోపణ.. ఆత్మకూరు ఎస్.. మండల పరిధిలోని నెమ్మికల్ పోల్కమ్మ కుంట చెరువులో శుక్రవారం రాత్రి అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. ఇటీవల ఇదే గ్రామంలో నీ చౌటచెరువు నుండి ఇటుక బట్టీలకు అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను జెసిబిని అడ్డుకున్న అధికారులు పోలీసులు పోల్కామ్మకుంటలో స్థానికులు అధికారుల సహకారంతో స్థానికులు అనుమతులు లేకుండా జెసిబి ట్రాక్టర్లతో అర్ధరాత్రి ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేసి తరలించారని స్థానికులు ఆరోపించారు. గత కొంతకాలంగా గ్రామంలో ట్రాక్టర్ల యజమానులు రెండు ముఠాలుగా చేరి అధికారులకు ముడుపులిచ్చిచెరువుల నుండి అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఇందుకు అధికారులు అంతర్గతంగా సహకరిస్తూ చెరువుల లూటీ చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా చెరువు మట్టి తవ్వకాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకున్నట్లయితే కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని స్థానికులు ఆరోపిస్తున్నారు.