యోగా సాధన తో శారీరిక ఆరోగ్యం జూపల్లి కృష్ణారావు

యోగాతో మానసిక ఆరోగ్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు
21-06-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం. చిన్నంబావి మండలం కొల్లాపూర్ లో యోగా సాధనతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్ లో పతాంజలి యోగా సమితి ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. మంత్రి జూపల్లి ప్రజలతో విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ యోగా భారతీయ ఘన వారసత్వ సంపదని, యోగా ప్రాచీన సంస్కృతిలో ఒక భాగమని, మన జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా పడుతున్న ఇబ్బందులను అధిగమించడానికి ప్రాచీన జీవన విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. యోగా, ధ్యానంతో మానసిక ఒత్తిడి, శారీరక రుగ్మతలను అధిగమించవచ్చాన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయసు నుంచే యోగా, ధ్యానం, వ్యాయామాన్ని అలవాటు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నిత్యం ఒక గంట పాటు శారీరక వ్యాయామం చేయాలని, తద్వారా మానసిక, శారీరక సమతౌల్యం కలుగుతుందని చెప్పారు.