యువ నాయకులే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్
గ్రామస్థాయి నుంచే నాయకత్వాన్ని తీర్చిదిద్దాలి
బీఎల్ఏలు చురుకుగా పనిచేయాలి.. ఒక్క ఓటు కూడా కోల్పోకూడదు
మహిళలకు యువజన కాంగ్రెస్‌లో సముచిత స్థానం కల్పిస్తాం
సూర్యాపేట. 27 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- యువ నాయకులను తీర్చిదిద్దడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ ఆధ్వర్యంలో జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ, వార్డు స్థాయి నుంచి యువ నాయకులను గుర్తించి వారికి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చైతన్యంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి యువత ముందుండాలని పిలుపునిచ్చారు.
యువజన కాంగ్రెస్ కమిటీలను గ్రామ, వార్డు స్థాయి వరకు విస్తరించాలని, చురుకుగా పనిచేసే యువతకు సంస్థాగత బాధ్యతలు అప్పగించాలని సూచించారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్తులో తగిన గుర్తింపు, అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని, ప్రతి బూత్‌లో బీఎల్ఏలు చురుకుగా పనిచేసి ఒక్క అర్హత గల ఓటు కూడా తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటరు జాబితాపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మహిళలకు యువజన కాంగ్రెస్‌లో మరింత ప్రాధాన్యం కల్పించాలని, ప్రతి కమిటీలో వారికి సముచిత స్థానం ఇవ్వాలని అన్నారు. ప్రతి మండలం, ప్రతి గ్రామంలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పార్టీ బలోపేతానికి యువత అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్‌లో పనిచేసిన వారికి పార్టీలో తగిన గుర్తింపు వచ్చేలా తాను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో యువజన స్టేట్ జనరల్ సెక్రెటరీ వేలిమినేటి సురేష్, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేది లక్షాధి, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, ఫ్లోర్ లీడర్ కుమ్మరి కుంట్ల వేణుగోపాల్, కౌన్సిలర్స్ కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, సునీల్ రెడ్డి, తన్వీర్ హుస్సేన్, సైదులు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు వేములకొండ పద్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్కిరేణి శ్రీనివాస్, బాలు గౌడ్, అబ్దుల్ రహీం, తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి, చింతమళ్ళ రమేష్, వీరన్న నాయక్, గడ్డం వెంకన్న, రుద్రంగి రవి, బండారు వెంకన్న, ఏడ్ల వీరమల్లు,గుణగంటి సతీష్, కోడి శివ, నీమ్మల లవన్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం, పడిదల రవి, యువజన పట్టణ అధ్యక్షుడు బొడ్డు సాయి, జోహార్, శ్రావ్య రెడ్డి, విజయభాస్కర్, మాధవరెడ్డి, నవీన్ చారి, హజిమ్ నరేష్, జావిద్, వినయ్, సుదీర్, లక్ష్మణ్, శివ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.