అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో భద్రాద్రిలో గోదావరి హారతి

Jun 21, 2026 - 22:28
 0  1
అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో భద్రాద్రిలో గోదావరి హారతి
అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో భద్రాద్రిలో గోదావరి హారతి
అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో భద్రాద్రిలో గోదావరి హారతి

తెలంగాణ వార్త జూన్ 21 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం:- భద్రాచలం ప్రజలు మరియు భక్తుల ఆదరాభిమానాలతో గోదావరి మాత నదిహారతి పురోహితుల మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా జరిగిందని రామ వజ్జల రవికుమార్ అన్నారు. ఆదివారం నాడు పరాభవ నామ సంవత్సరం శుద్ధ సప్తమి సీతారామచంద్రస్వామి దివ్య క్షేత్రం భద్రాచలం లోని గోదావరి నాన్న ఘట్టాల వద్ద జరిగిన నదీహారతి కార్యంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి కొలువై ఉన్న ప్రదేశంలోని గోదావరి తీరంలో ఈరోజు జరిగే నదిహారతికి ఒక విశిష్టత ఉందని నిజ జేష్ఠ మాసం శుద్ధ సప్తమి ఆదివారం సూర్యభగవానునికి, సూర్య వంశమునకు చెందిన శ్రీరామచంద్రుడికి కూడా విశేషమైన ఈ రోజు గోదావరి నదికి హారతులు సమర్పించడం మంగళ ప్రధానమైనదని, శ్రీ సీతారామనుగ్రహం పుణ్య గోదావరి శుభాశీస్సులతో ప్రజలకు సకల శుభాలు కలుగుతాయని, భక్తులకు తెలిపిన అనంతరం సాయంత్రం 6:30 గంటలకు జైశ్రీరామయ నమః అని శ్రీరామ స్మరణతో గోదావరి నదికి భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం  ఆధ్వర్యంలో గోదావరి హారతి నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, దేశ విదేశాల నుండి వచ్చే భక్తులు నదిహారతి కార్యక్రమంలో పాల్గొని పునీతులు అవుతున్నారని అన్నారు. అనంతరం పురోహితులు గోదావరి హారతి విశేషాలను ముందుగా వినిపించి, గణపతి పూజ, జైశ్రీరామ్ అలంకారంలో 108 ప్రమిదలతో దీపోత్సవం భక్తులనే స్రుశింప చేసి పూజా ద్రవ్యాలతో గోదావరి నదికి  అష్టోత్తర శతనామార్చన చేశారని, పురోహితులు
 శ్రీరామ అష్టోత్తరం పటిస్తుండగా ఓం శ్రీ రామాయ నమః అంటూ108 సార్లు భక్తులచే శ్రీరామ నామ భజన అనంతరం ముందుగా సీతారామచంద్రస్వామి వారికి12 సార్లు హారతి ఇచ్చిన ఆనంతరం గోదావరి నదికి 21 సార్లు హారతిఇవ్వడం జరిగిందని, లోక కళ్యాణార్థం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ మహాత్కార్యంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, రామాను గ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొందాలని ఆయన అన్నారు.

అనంతరం శాంతి మంత్ర పఠనం జరిపి, రామకృష్ణ దంపతులు మరియు పి వి ఎస్ ఎన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో పులిహోర ప్రసాదం, నైవేద్యం, శనగలు భక్తులకు పంపిణీ చేయడం జరిగిందని, నదిహారతి కార్యక్రమానికి పూజా సామాగ్రి శ్రీ రాఘవేంద్ర బట్టల షాప్ భద్రాచలం వారు అందించారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో పురోహితులు రామాచార్యులు, తేజశర్మ, సత్య ప్రసాద్ శర్మ, సుబ్రహ్మణ్యాచార్యులు, వీరభద్ర శర్మ, అశోక్ కుమార్ శర్మ, శివ మరియు స్వచ్చంద సంస్థలు, భద్రాద్రి కా మహారాజు ప్రతినిధులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333