మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

Apr 18, 2026 - 21:57
 0  5
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

తిరుమలగిరి 19 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

యాసంగి సీజన్‌లో రైతులు పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరను పొందాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్  రైతులకు సూచించారు. శనివారం తిరుమలగిరి మండల కేంద్రంలోని స్థానిక మార్కెట్ యార్డులో  సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. మొక్కజొన్న పంట క్వింటా ల్‌కు మద్దతు ధర రూ.2400లు ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎల్సోజు స్రవంతి నరేష్, మున్సిపాలిటీ చైర్మన్ రఘునందన్ రెడ్డి ,పాలెపు చంద్రశేఖర్, సీఈవో విజయ్ కృష్ణ రెడ్డి ,కౌన్సిలర్లు పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి