మైనర్లు వాహనాలు నడుపుతే కఠిన చర్యలు
మైనర్లు వాహనాలు నడపడంపై ప్రమాదం....
అయిజ Si 2 కిరణ్...
జోగులాంబ గద్వాల 15 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : అయిజ. మున్సిపాలిటీ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా నేడు రోడ్డు భద్రత వారోత్సవాలలో సందర్భంగా వాహనదారులకు హెచ్చరించారు
అనంతరం ఈ సందర్భంగా SI కిరణ్ మాట్లాడుతూ.. వాహనం నడుపుతున్న వ్యక్తి వెనక్కు కూర్చున్న వ్యక్తి ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాల్సిందే..
ఈ మధ్యకాలంలో మైనర్లు వాహనం నడపడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కావున తల్లిదండ్రులు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల మనకి మనమే ప్రమాదాలు చేసుకునే అవకాశం ఉంది.
ప్రతి ఒక్కరూ మనం మొబైల్ ఫోన్లకు పౌచ్ ఎలా అయితే వేసుకుంటాము అలానే మన తలకు హెల్మెట్ పెట్టుకోవాలని ఆ మొబైల్ ఫోన్ పోతే తిరిగి తెచ్చుకోగలం కానీ ప్రాణం పోతే ఎవరు కూడా తెచ్చుకోలేం ఆ కుటుంబం రోడ్డున పడుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి మద్యానికి దూరంగా ఉండి వాహనాలను నడపాలని తెలియజేయడం జరిగినది....
మైనర్ నడిపి ప్రమాదం చేస్తే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చెల్లదు.
ప్రమాదంలో ఎవరైనా చనిపోతే, యజమానిపై IPC సెక్షన్ల కింద కేసు కూడా పెడతారు. జువైనల్ జస్టిస్ బోర్డ్ ముందు మైనర్‌ను హాజరుపరచాల్సి ఉంటుంది....
రోడ్డు భద్రత, హెల్మెంట్, ట్రాఫిక్ నిబంధన, ఓవర్టేక్ తధితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
తల్లిదండ్రులు చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు.
మైనర్లకు అనుభవం, రోడ్డుపై అవగాహన తక్కువ. వేగం, నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుందని, వాహనాలు ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు....
ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ శ్రీనివాసులు, రమణ, రవి నాయక్....