మే 24 నుండి ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్షలు 

Apr 25, 2024 - 19:55
 0  5

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు విడుద‌లైన సంగ‌తి తెలి సిందే. ఫ‌స్టియ‌ర్‌లో 60.01 శాతం, సెకండియ‌ర్‌లో 64.19 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది.

ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో బాలి క‌లు 68.35 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, బాలురు 51.50 శాతం న‌మోదు చేశారు. ఇక సెకండియ‌ర్‌లో బాలిక‌లు 72.53 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, బాలురు 56.10 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.

గ‌తేడాది ఇంట‌ర్ ఫ‌లితాల్లో ఫ‌స్టియ‌ర్‌లో 62.85 శాతం, సెకండియ‌ర్‌లో 67.27 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. అంటే 2023 ఫ‌లితాల‌తో పోల్చితే ఈ ఏడాది ఉత్తీర్ణ‌త శాతం స్వ‌ల్పంగా త‌గ్గింది.

ఇక తాజాగా విడుద‌లైన ఇంట‌ర్‌ ఫ‌లితాల్లో ఫెయిలైన వారికి మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌ను న్నారు.

ఫ‌స్టియ‌ర్‌కు ఉద‌యం 9 నుంచి మ‌. 12 గంట‌ల వ‌ర‌కు సెకండియ‌ర్ విద్యార్థుల‌కు మ‌. 2.30 నుంచి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌ నున్నారు.

అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లకు సంబంధించిన ప‌రీక్ష ఫీజును ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ వ‌ర‌కు ఆయా కాలేజీల్లో స్వీక‌రించ‌ నున్నారు. రీకౌంటింగ్, రీవెరి ఫికేష‌న్‌కు సంబంధించి కూడా ఇదే స‌మ‌యంలో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించా ల్సి ఉంటుంది.

రీకౌంటింగ్ కోసం ఒక్కో పేప‌ర్‌కు రూ. 100, రీకౌంటింగ్‌కు ఒక్కో పేప‌ర్‌కు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333