మృతురాలు కుటుంబానికి అండగా నిలిచిన డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్

Aug 7, 2026 - 00:12
 0  0
మృతురాలు కుటుంబానికి అండగా నిలిచిన డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్

కేతేపల్లి 6 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్గొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో త్రీవంగా గాయపడి హైదరాబాద్ పవన్ సాయి హాస్పిటల్ లో చికిత్స  పొందుతూ మృతి చెందిన పోకల నవనీత కుటుంబాన్ని పవన్ సాయి హాస్పిటల్ అధినేత ఆలేటి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా నవనీత భర్త పోకల మోహన్ రావుని వారి ముగ్గురు చిన్నారులను కలిసి ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని కల్పించారు.అనంతరం తన మానవతా దృక్కుపదాన్ని చాటుతూ తన వంతు సహాయంగా 10వేల రూపాయల సహాయాన్ని అందజేశారు.బాధిత కుటుంబానికి అండగా నిలిచిన డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ కి కుటుంబ సభ్యులు  అభినందనలు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333