మూడు ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచిన యువకుడు 

Oct 3, 2024 - 20:49
 0  73
మూడు ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచిన యువకుడు 

  అక్టోబర్  3 తెలంగాణ వార్త:  మండల పరిధిలోని ఈటూరు గ్రామానికి చెందిన జోగం నరేష్‌ ఒక ఉద్యోగం చేస్తూనే మళ్లీ రెండు ఉద్యోగాలు సాధించాడు. మొత్తం మూడు ఉద్యోగాలు సాధించిన యువకుడు. సోమవారం వెల్లడైన డీఎస్సీ ఫలితాల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ (సోషల్‌) విభాగంలో జిల్లా 12వ ర్యాంక్,  సెండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) ఉద్యోగాలు సాధించాడు. అలాగే మూడు నెలల క్రితం ప్రకటించిన గురుకుల ఫలితాల్లో సోషల్‌ విభాగంగాలో జోన్‌ మొదటి ర్యాంక్‌ సాధించి గురుకుల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. జోగం నరేష్‌ ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచాడు. జోగం నరేష్‌ మూడు ఉద్యోగాలు సాధించడంతో తల్లీదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333