మున్సిపల్ అధికారుల్లారా ఇదెక్కడి చోద్యం
మున్సిపల్ అధికారుల అలసత్వమా - అధికార దర్పమా
మున్సిపల్ అధికారుల ముందే కమిషనర్ ను ప్రశ్నించిన BRS కౌన్సిలర్ పులిపాటి వెంకటేశ్,& జగదీష్ (TNR)
జోగులాంబ గద్వాల 6మార్చి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. జిల్లా మున్సిపల్ కార్యాలయం ఆవరణ నందు తొంబై తొమ్మిది రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి హాజరై * టిఆర్ఎస్ 21 వ వార్డు కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదే రోజే సర్క్యులర్ - అదే రోజు మీటింగ్ 99 రోజుల ప్రగతి అంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే - ఇక్కడి మున్సిపల్ అధికారులేమో తూ తూ మంత్రంగా పని చేస్తున్నారు. మార్చి 06 న ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి మొదలెట్టాలి అని చెబితే - ఇక్కడి మున్సిపల్ అధికారులేమో 06కి సర్క్యులర్ విడుదల చేసి ఉదయం 8: 30నిమిషాలకు మున్సిపల్ కౌన్సిల్ కు సమాచారం ఇస్తున్నారంటే ఇదెక్కడి చోద్యం.. మున్సిపల్ ఇచ్చిన కార్యక్రమాలు నడపడానికా లేక అభివృద్ధి నీ అడ్డగించడానికా మున్సిపల్ అధికారులకు ఇంకా కౌన్సిల్ ఎన్నికయినట్టు వారు ప్రమాణ స్వీకారం చేసినట్టు కనిపించినట్టు లేదు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి అధికారుల తీరును మార్చుకోవాలి ప్రజా ప్రతినిధులకు గౌరవం ఇవ్వాలి.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ వార్డ్ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.