మునగాల మండలంలో ఘనంగా వేడి వేడుకలు

మునగాల 01 మే 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
1886 లో అమెరికా చికాగో నగరంలో 8 గంటల పని దినానికై కార్మికులు శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తుంటే కార్మికుల పైన పోలీసులు కాల్పులు జరిపి ఆరుగురి ప్రాణాలను బలి గోన్నారు. వారు చిందించిన రక్తం లో నుంచి కార్మికుల తమ చొక్కాలను విప్పి ఎర్రజెండాలుగా ఎత్తినారు. ఆనాటి పోరాటం ప్రపంచవ్యాప్తంగా చట్టబద్ధం దాల్చి ఎనిమిది గంటల పని విధాలను సాధించుకోవడం జరిగిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శులకు సభ్యులు ఎం. వెంకటేశ్వర జిల్లా కమిటీ సభ్యులు వెంకట్ రెడ్డి, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బుర్రి శ్రీరాములు, పార్టీ మండల కార్యదర్శి చందా చంద్రయ్య, అన్నారు.బుధవారం 138వ మేడే ఉత్సవాల సందర్భంగా మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనం అరుణ పతాక ని పార్టీ మండల కార్యదర్శి చందా చంద్రయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, ఎస్కే సైదా, వి.వెంకన్న,దేశిరెడ్డి స్టాలిన్ రెడ్డి, బట్టుపల్లి ఉపేందర్, మామిడి గోపయ్య, బి కృష్ణారెడ్డి, బి నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.