**ముఠాపురంలో ఇందిరమ్మ ఇల్లు పట్టాల పంపిణీ""వ్యవసాయం మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల*

May 26, 2025 - 19:18
 0  7
**ముఠాపురంలో ఇందిరమ్మ ఇల్లు పట్టాల పంపిణీ""వ్యవసాయం మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల*

*ముఠాపురం లో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ*

*ఇది పేదల ప్రభుత్వం, ప్రతి ఒక్కరూ సంతోషం గా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం*

నేలకొండపల్లి మండలం ముఠాపురం లో రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సూచనతో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన అన్నారు.ఇచ్చిన మాట ప్రకారం పేదలందరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నారని ఆయన అన్నారు.ఎన్నో ఏళ్ళుగా సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న పేదల కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేసిందని ఆయన అన్నారు.గత BRS ప్రభుత్వం లో మాటలు చెప్పింది తప్ప చేసింది శూన్యం అని ఆయన విమర్శించారు. మొదటి విడతలో స్థలం ఉన్న వారికి ఇళ్లను కేటాయించారని ఆయన తెలిపారు.ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం లో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని ఆయన చెప్పారు.ఎన్నో ఏళ్ళు గా ఎదురు చూస్తున్న సొంతింటి కల నెరవేరడం తో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పొందిన లబ్దిదారులు ప్రభుత్వనికి మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శాఖమూరి రమేష్, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొడాలి గోవింద రావు,బొడ్డు బొందయ్య, మామిడి వెంకన్న,గ్రామ నాయకులు బొలినేని వెంకన్న,బెల్లం వాసు,గుడిమెట్ల మధు తదితరులు పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State