మా ఊరికి ఆర్టీసీ బస్సు నడపాలి సర్పంచ్ రాచకొండ రమేష్ గౌడ్

Apr 18, 2026 - 19:41
Apr 18, 2026 - 19:43
 0  3
మా ఊరికి ఆర్టీసీ బస్సు నడపాలి సర్పంచ్ రాచకొండ రమేష్ గౌడ్

అడ్డగూడూరు18 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామం గ్రామానికి హైదరాబాద్ ఉప్పల్ వరకు ఆర్టీసీ నైట్ బస్సు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని శనివారం రోజు యాదాద్రి గుట్ట ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ ని కలిసి వినతి పత్రం అందజేసిన గ్రామ సర్పంచ్ రాచకొండ రమేష్ ఆయన మాట్లాడుతూ..కొండంపేట, ఆజింపేట,వెల్దేవి మారుమూల ప్రాంతాలు కావడంతో గ్రామ ప్రజలకు బస్సు సౌకర్యం లేక పడరాని పట్లు పడుతున్నారని అన్నారు.ప్రజల సౌకర్యార్థం దృష్టి పెట్టుకొని వెంటనే వెల్దేవి గ్రామానికి బస్సును నడపాలని కోరిన వెల్దేవి గ్రామ సర్పంచ్ రాచకొండ రమేష్ గౌడ్ వారితో పాటు వార్డ్ సభ్యులు బోడ యాదగిరి,అజీంపేట గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొమ్మగోని సైదులు తదితరులు పాల్గొన్నారు.