మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డికి ఘన సన్మానం

సూర్యాపేట,08 మార్చి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్'- సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకమైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డిని శనివారం హైటెక్ బస్టాండ్ ఫోర్ వీలర్ అసోసియేషన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరికంటి అంబేద్కర్ ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సన్మానించారు. ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం మరికంటి అంబేద్కర్ మాట్లాడుతూ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా గత 40 సంవత్సరాలుగా తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గం పార్టీని బలోపేతం చేశారని అన్నారు. ఎనాడు పదవులు ఆశించకుండా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేసిన కొప్పుల వేణారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశము కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హైటెక్ బస్టాండ్ ఫోర్ వీలర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కలకోట్ల ప్రసాద్, కోశాధికారి కొండూరు వీరయ్య, ఉపాధ్యక్షులు దేవ్ దేవత శివ, అక్కినపల్లి శ్రీను, ఉదయ్ రెడ్డి, గుండు నరేష్, పిల్లల శ్రీను, సిద్ధప్ప, జగ్గారెడ్డి, శేఖర్, సాయి, వెంకట్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.