మానవసేవే మాధవసేవ మార్గమే మహామంత్రి పేదల పాలిట పెన్నిధి"జయప్రద ఫౌండేషన్"జగ్గయ్యపేటలో

మానవసేవే మాధవసేవ ఆరోగ్యమే మహాభాగ్యం పేదల పాలిట పెన్నిధి జయప్రద ఫౌండేషన్
ఏపీ తెలంగాణ వార్తా ప్రతినిధి రావెళ్ళ జగ్గయ్యపేట : పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో జయప్రద ఫౌండేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ *తొండపు దశరథ జనార్ధన్* మాట్లాడుతూ, జయప్రద ఫౌండేషన్ పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తుందని తెలిపారు.
ఈ ఫౌండేషన్‌ను తన భార్య *జయప్రద* పేరు మీద కుమారుడు, కుమార్తెతో కలిసి ఏర్పాటు చేశారని, గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. అనేక పాఠశాలల్లో ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం, కరోనా కాలంలోనూ, వరదల సమయంలోనూ భోజన వసతి కల్పించడం, తమ దత్తత గ్రామాలలో ఎవరు మరణించినా మట్టి ఖర్చుల కోసం రూ.5,000, అలాగే వివాహం చేసుకున్న కొత్త జంటలకు వస్త్రాలు అందజేస్తున్నామని వివరించారు.
ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడానికి రాజకీయంగా అవకాశాలు కల్పించిన స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) గారికి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉచిత వైద్య శిబిరాలను ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ శిబిరాలకు మంచి స్పందన లభించిందని తెలిపారు. పట్టణంలోని 31 వార్డుల ప్రజలకు అందుబాటులో ఉండేలా 10 చోట్ల శిబిరాలు ఏర్పాటు చేసి, దాదాపు 10 వేల మందికి పైగా వైద్య సేవలు అందించామని వివరించారు.
మొత్తం ఒపీ లు: 10543
జనరల్ ఒపీ: 6,078
డెంటల్ ఒపీ: 1,090
కంటి ఒపీ: 7,821
కంటి ఆపరేషన్లు చేయాల్సినవారు: 1,081
వీరిలో చేసిన ఆపరేషన్లు: 503
కళ్ళళ్ళు అందించినవారు: 4,643
షుగర్ & బ్లడ్ టెస్టులు: 10,543
ఈసీజీలు: 533
ఎక్స్‌రేలు: 183
ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కట్ట నరసింహారావు, మైనేని రాధాకృష్ణ, ఫౌండేషన్ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేస్తామని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, రక్తహీనత, కంటి పరీక్షలు, ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే పాత్రికేయుల కుటుంబాల కోసం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
# *Team Td Janardhan* #