మాటలు కాదు పనులు మాట్లాడతాయి, మా అరుణమ్మ అభివృద్ధిపై అవగాహనలేని వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకో లిక్కర్ రాణి
జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షులు S.రామచంద్రారెడ్డి
జోగులాంబ గద్వాల 23 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల రాజోలి బండ దగ్గర రాళ్ల దెబ్బలుకు వెనకడుగు లేదు గద్వాల నియోజకవర్గం లో ప్రతి మండలం కేద్రం లో జూనియర్ కాలేజీలు తెచ్చిన ఘనత మా నేతది మీ అయ్యను మెడలు వంచి జిల్లా తెచ్చిన ఘనత మా నేతది మీ అయ్యా 10 సంవత్సరాలలో ఎన్ని DSC లు వేశాడు
నెట్టంపాడు ప్రాజెక్టు తెచ్చిన ఘనత మా నేతది
లిక్కర్ రాణి నివా మా నాయకురాలు ని విమర్శించేది
జోగులాంబ గద్వాల జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షులు
ఎస్. రామచంద్రారెడ్డి, భారతీయ జనతా పార్టీ అయిజ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డీకే అరుణమ్మ పై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవగాహనలేనివని, వాస్తవాలకు విరుద్ధమైనవని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది.
మాటల రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం తప్ప, వాస్తవ అభివృద్ధిని దాచలేరని బీజేపీ స్పష్టం చేసింది.
గత దాదాపు పది సంవత్సరాల టీఆర్‌ఎస్ పాలనలో జోగులాంబ గద్వాల జిల్లాకు చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ జరగలేదని, ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా సరిగా అందలేదని బీజేపీ ఆరోపించింది.
డీకే అరుణమ్మ సహకారంతోనే జిల్లాలో నిజమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని స్పష్టం చేశారు.
అరుణమ్మ కృషితోనే గోన్పాడు మండలంలో కళాశాల ఏర్పాటు, జిల్లాలో మహిళా డిగ్రీ కళాశాల స్థాపన, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగిందని తెలిపారు.
మహిళల చదువు, సాధికారత విషయంలో అరుణమ్మ ఎప్పుడూ రాజీ పడలేదని అన్నారు.
అలాగే రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధి కూడా ఆమె సహకారంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు.
డీకే అరుణమ్మ కుర్చీల కోసం కాదు, ప్రజల కోసం పోరాడిన నాయకురాలని స్పష్టం చేశారు.
రాజోలి బండ సమీపంలో రాయలసీమ గుండాల చేతిలో రాళ్ల దెబ్బలు తిన్నా, వెనకడుగు వేయకుండా గుండె ధైర్యంతో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించిన ధైర్యవంతమైన మహిళా నాయకురాలు డీకే అరుణమ్మ ని కొనియాడారు.
అటువంటి నాయకురాలిపై “ఏ అభివృద్ధి చేయలేదని” వ్యాఖ్యానించడం రాజకీయ అజ్ఞానానికి, దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
మీ అయ్యా పదేళ్ల పాలన లో మా అలంపూర్ కు D40 (చివరి ఆయకట్టు) వరకు నీళ్ల రాలె, మల్లమ్మకుంట రిజర్వాయర్ కాలే, జిల్లాలో రహదారులకు కనీసం గంపమట్టి వేయలేదు ,రాష్ట్ర లో ఎన్ని DSC వేశాడు మీ అయ్యా నెట్టంపాడు కు నిధుల రాలె ఈ రకంగా మొత్తం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి అసత్య వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
డీకే అరుణమ్మ అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన లేకుండా చేసిన ఇలాంటి అసత్య, నిరాధార వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని,
లేకపోతే ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ మరింత గట్టిగా ప్రతిస్పందిస్తుందని
ఎస్. రామచంద్రారెడ్డి ఘాటుగా డిమాండ్ చేశారు.
మాటలతో కాదు, పనులతోనే నాయకులను ప్రజలు అంచనా వేస్తారని,
జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధి కోసం బీజేపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడికొండ భీమ్ సెన్ రావు, అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి, అయిజ పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, బెల్లంకొండ నాగరాజు, ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మణాచారి, వీరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.