మాజీ మంత్రి జగదీష్ రెడ్డినీ సస్పెన్షన్ చేయడం అంటే  ప్రజా సమస్యలను ఖునీ చేయడమే

బిషప్ దుర్గం ప్రభాకర్

Mar 17, 2025 - 19:41
 0  5
మాజీ మంత్రి జగదీష్ రెడ్డినీ సస్పెన్షన్ చేయడం అంటే  ప్రజా సమస్యలను ఖునీ చేయడమే
మాజీ మంత్రి జగదీష్ రెడ్డినీ సస్పెన్షన్ చేయడం అంటే  ప్రజా సమస్యలను ఖునీ చేయడమే
మాజీ మంత్రి జగదీష్ రెడ్డినీ సస్పెన్షన్ చేయడం అంటే  ప్రజా సమస్యలను ఖునీ చేయడమే
మాజీ మంత్రి జగదీష్ రెడ్డినీ సస్పెన్షన్ చేయడం అంటే  ప్రజా సమస్యలను ఖునీ చేయడమే

తెలంగాణా రాష్ట్ర క్రైస్తవ నాయకులు
                 చింత మనిషే
ఉమ్మడి నల్గొండ జిల్లా క్రైస్తవ నాయకులు

మార్చి 17 సోమవారం: సూర్యాపేట పట్టణ కేంద్రం లోని శాంతినగర్ 5వ వార్డు నందు బేతెస్థ చర్చ్ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో తెలంగాణా రాష్ట్ర క్రైస్తవ బి. ఆర్.యస్.పార్టీ నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో అమలు చేయని హామీలు అబద్ధాలుగా ఉన్నాయంటూ తెలంగాణా  స్వరాష్ట్ర ఉద్యమ నాయకులు, ప్రజా సమస్యలు తన ఊపిరిగా భావిస్తూన్నా మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రజలకు ఇస్తామన్నా హామీలు ఎక్కడ అనీ మాట్లాడితే దళిత స్పీకర్ ను అవమానించాడంటూ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయడం కాంగ్రెస్ కుట్రపూరిత చర్య అనీ,సస్పెన్షన్ చేయడం అంటే  ప్రజా సమస్యలను ఖునీ చేయడమే అనీ, జగదీష్ రెడ్డి ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండింస్తూన్నామని అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ క్రైస్తవ పాస్టర్స్ కు పది వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ అబద్దాలు చెప్పి ఓట్లు దండుకొని మోసం చేసిందనీ, మొన్న కులఘణంకనలో కూడా క్రైస్తవుల ఊసు లేకుండా రాష్ట్ర క్రైస్తవ ప్రజలను మోసం చేశారని,చిత్త శుద్ధి ఉంటే ఈ బడ్జెట్ లోనే ముప్పై వేలకోట్లు క్రైస్తవ సంక్షేమానికి కేటాయించాలని, వెంటనే హైదరాబాద్ లో క్రైస్తవ భవనం పనులు ప్రారంభం చేయాలనీ, క్రైస్తవుల పట్ల చర్చి లపై దాడులను అరికట్టడంలో మత  స్వేచ్ఛను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందననీ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తగిన సమయంలో ప్రజలు బుద్ది చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమం లో పాస్టర్ సి. హెచ్. శ్యామ్ ప్రసాద్, ఉమ్మడి నల్గొండ జిల్లా క్రైస్తవ నాయకులు చింత మనిషే,బిషప్ ముల్లంగి జాకబ్ రాజు, సి. హెచ్. కిరణ్ కుమార్, పి. సామెల్, యల్క ప్రభాకర్, బోడ లూకా, పి. వి. బోయాజ్, యాకోబు, రూబెన్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333