మహిళపై జరుగుతున్న అత్యాచారాలను ప్రభుత్వాలు నియంత్రించలేకపోతున్నారు
వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పి ఆర్ దేవి
ఖమ్మం, 17 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
ఖమ్మం నగరంలో సావిత్రిబాయి పూలే మహిళా సంఘం జిల్లా సమావేశంలో కటకం లక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పి ఆర్ దేవి పాల్గొని మాట్లాడారు . రాను రాను సమాజం ఏమైపోతుందో ఇంకా వ్యక్తులలో మార్పు రావడం లేదు మహిళలు ఒంటరిగా బయటికి రావాలంటే భయపడుతున్నారు . ఇప్పటికీ కూడా మహిళలకు స్వేచ్ఛ అనేది లేకపోవడం చాలా బాధాకరం . పసిపిల్లల దగ్గర నుండి 70 ఏళ్ల ముసలి వాళ్ళ ఫై కూడా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి . చట్టాలు ఎన్ని వచ్చినా నియంత్రించలేకపోతున్నారు ఇప్పుడున్న సమాజంలో మహిళలు తమ కుటుంబాలను చూసుకుంటూ బయటికి వచ్చి ఉద్యోగాలు చేస్తూ జీవన ఉపాధి కోసం కష్టపడుతున్నారు . అయినప్పటికీ ఇంకా చాలా అత్యాచారాలు ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి . ప్రభుత్వం వారు వీటిపై ఇంకా చర్యలు కఠినంగా తీసుకోవాలి , మహిళలకు రక్షణ కల్పించాలి అని అన్నారు . అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి . భార్యాభర్తలు ఎంత కష్టపడుతున్న అవి ఎటు సరిపోని పరిస్థితుల్లో ఉన్నారు . ప్రజలు కనుక ప్రభుత్వం నిత్యవసరసరుకులపై రేట్లు తగ్గించాలని కోరారు . అలాగే వృద్ధులు , వికలాంగులు , వితంతువులు , ఒంటరి మహిళల పెన్షన్లు కూడా పెంచుతామన్నారు కానీ అవి ఇప్పటివరకు ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు . కాబట్టి పింఛన్ల మీదనే బతుకుతు ఎంతోమంది వాటి కోసమే ఎదురుచూస్తున్నారు . కాబట్టి ప్రభుత్వం తక్షణమే తను పెంచుతానన్నవి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు . అలాగే కొత్త అప్లికేషన్లు కూడా తక్షణమే రేషన్ కార్డులు కానీ కొత్త పెన్షన్లు కానీ అమలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ సమావేశంలో వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం నాయకులు చిప్ప సత్యవతి , భూక్యా మణి , ఇనుప నూరి నాగలక్ష్మి , తిప్పర్తి రమ్య , కామన అనంతలక్ష్మి , భవాని , ఖమ్మం జిల్లా ఉమెన్ రైట్స్ అధ్యక్షులు మంచు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .