మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన ఫైర్ కానిస్టేబుల్

తిరుమలగిరి మోత్కూర్ 8 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని అనాజిపురం గ్రామంలో అదే గ్రామానికి చెందిన ఫైర్ కానిస్టేబుల్ కిరాణా షాప్ నిర్వహిస్తున్న మహిళలపై దాడి తీసి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, అనాజిపురం గ్రామంలోని తన ఇంట్లో ఇరుకుల సంతోష్ లక్ష్మి అనే మహిళ కిరాణా షాపు నిర్వహిస్తుంది. శనివారం రాత్రి 10:30 సమయంలో అదే గ్రామానికి చెందిన మలిపెద్ది మహేందర్ రెడ్డి అని ఫైర్ కానిస్టేబుల్ బీర్లు ఇవ్వాలని ఇంటి దగ్గరికి వెళ్లి గొడవ చేసాడు. రాత్రి సమయంలో డోర్లు తీయకపోయేసరికి, బూతులు తిడుతూ డోర్లను తన్నడం మొదలుపెట్టాడు. ఎవరు అని సదరు మహిళ అడగ్గా, బీర్లు ఇవ్వాలని మహేందర్ రెడ్డి డిమాండ్ చేశాడు. ఈ సమయంలో ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పినప్పటికీ బూతులు తిట్టాడు. డోర్ తీసి, బయటికి వచ్చి, ఇక్కడ నుండి వెళ్లిపోవాలని చెప్పడంతో ఆమెపై దాడికి తెగబడ్డాడు. నైటీలో ఉన్న మహిళపై దాడి చేసి, నైటీని చిప్పేసాడు. గొడవ చూసి భర్త బయటికి రాగా, దిక్కున చోట చెప్పుకో, నేను పోలీస్ ని, ఎప్పుడు వచ్చి అడిగిన, డోర్ తీయాలి, అడిగింది ఇవ్వాలి అని, మహిళ భర్త పై అక్కడ ఉన్న పెద్ద రాయి తీసుకుని దాడికి దిగాడు. గొడవ చూసిన ఇరువురు అక్కడి చేరుకోగా అడిగిన వారిపై కూడా దాడికి దిగాడు. బాధితురాలు 100 డైల్ చేసి, పిర్యాదు చేసింది. ఆదివారం ఉదయం బాధితురాలు పోలీస్ స్టేషన్ చేరుకొని వ్రాతపూర్వకంగా పిర్యాదు చేసింది. మోత్కూర్ ఫైర్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న, ఫైర్ కానిస్టేబుల్ మలిపెద్ది మహేందర్ రెడ్డి నా ఇంటికి అకారణంగా వచ్చి గొడవ చేసి, నాపై దాడి చేసి, వేసుకున్న డ్రెస్సులను చింపి, అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బాధితురాలు విలేకరులకు తెలిపారు...