మహా ధర్నాను జయప్రదం చేయండి.సీఐటీయూ పిలుపు

జోగులాంబ గద్వాల 19 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మార్చి 21న హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ వెంకటస్వామి వివి నరసింహ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు మంగళవారం జిల్లా కేంద్రంలోని స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొన్నారు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణం హమాలి ట్రాన్స్ పోర్ట్ బీడీ రంగం వంటి అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఇందిరా పార్క్ లో జరిగే ధర్నాకు కార్మిక వర్గం అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం మరియు వలస కార్మికుల చట్టం రద్దవుతాయని రాష్ట్ర వెల్ఫేర్ బోర్డులు నిర్వీర్యమై భవన నిర్మాణ కార్మికులకు ప్రస్తుతం అందుతున్న పథకాలు కూడా రద్దు అవుతాయని అన్నారు అడ్డామీద హామాలిలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పోరాడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారి సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12 వేల రూపాయల ఇస్తామని ఆటోనగర్ లు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని విమర్శించారు బీడీ కార్మికులకు 2014 కటాఫ్ తేదీని తొలగించి 4000 భృతి ఇస్తామని బీడీ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా నూతన కార్మిక చట్టాల ద్వారా కార్మిక హక్కులను కాల రాయాలని చూస్తున్నారని విమర్శించారు. అందుకే హమాలి ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని బీడీ కార్మికులకు జీవన భృతి కనీస వేతనాల జీవో విడుదల చేయాలని భవన నిర్మాణ కార్మికులకు అడ్వైజరీ కమిటీని నియమించి బోర్డు నిధులను అర్హులైన కార్మికులకు ఖర్చు చేయాలని తదితర డిమాండ్లతో చేపడుతున్న ఈ మహా ధర్నా కార్యక్రమానికి జిల్లా నుండి కార్మిక వర్గం అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ హమాలీ సంఘం ఉపాధ్యక్షుడు నరేష్ వీరేష్ నాయకులు రామాంజనేయులు రామకృష్ణ బద్రి తదితరులు పాల్గొన్నారు .