మహా కుంభాభిషేకానికి ఏర్పాట్లు పూర్తి

జోగులాంబ గద్వాల 2 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-మల్దకల్ ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 5న జరిగే స్వామివారి దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్ట, శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్టతో పాటు గోపురం మహాకుంభాభిషేకం, మహా రుద్రాయాగం కార్యక్రమాలకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా యాగశాల ప్రవేశం, దేవత ఆహ్వానం కలశ ప్రతిష్టలు జరిగాయి. ఈ కార్యక్రమంలో దేవాలయం వ్యవస్థాపక వంశీయులు శ్రీ కృష్ణమాన్య పట్వారి ప్రహ్లాద రావు,ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో స్తంభాద్రి దేవస్థానం పండితులు వాసుదేవా చారి రమేష్ తదితరులు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జరిగే కార్యక్రమాలలో ఈనెల ఐదున .మంత్రాలయ పీఠాధిపతులు 1008 శ్రీశ్రీశ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి హాజరుకానున్నారు