భూభారతితో రైతుల సమస్యలకు పరిష్కారం

Apr 26, 2025 - 03:42
Apr 26, 2025 - 03:45
 0  8
భూభారతితో రైతుల సమస్యలకు పరిష్కారం

ఎమ్మెల్యే మందుల సామేల్*

కలెక్టర్ హనుమంతరావు

అడ్డగూడూరు 25 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్రంలో 2025 ఏప్రిల్ 14 నుండి అమల్లోకి వచ్చిన కొత్త భూ పరిపాలన చట్టం.ఇది రైతులకు,భూమి హక్కుదారులకు, మరియు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రూపొందించబడిందని,ఈ చట్టం ముఖ్యంగా భూ రికార్డుల నిర్వహణను సులభతరం చేయడం,భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణ,భూముల రిజిస్ట్రేషన్,మ్యుటేషన్ (పేరుమార్పు)ప్రక్రియలను పారదర్శకంగా చేయడం, అలాగే సాదా బైనామా వంటి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి దోహదపడుతుంది అని ఆర్డీవో కృష్ణారెడ్డి అన్నారు.అనంతరం కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ..భూ భారతి చట్టం రైతుల చుట్టం,భూమి హక్కుల రికార్డుల నిర్వహణ భూ భారతి చట్టం ద్వారా ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డులను నిర్వహిస్తారు.భూముల వివరాలు సర్వే చేసి మ్యాప్ తయారు చేయడం తప్పనిసరి చేయబడింది.ఇది హద్దుల వివాదాలు రాకుండా చేస్తుందని అన్నారు.అదేవిధంగా తప్పుల సవరణకు అవకాశం భూ రికార్డుల్లో ఏమైనా తప్పులు ఉంటే,రైతులు నిర్దేశిత రుసుము చెల్లించి భూ భారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ దరఖాస్తులను ఆర్డీవోలు,కలెక్టర్లు పరిశీలించి నిర్ణయిస్తారు.అభ్యంతరాలు ఉంటే రీ-అప్పీల్, అప్పీల్ కూడా చేయవచ్చు అని అన్నారు.పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారo గతంలో పెండింగ్‌గా ఉన్న సాదా బైనామా దరఖాస్తులకు ఈ చట్టం పరిష్కారం కల్పిస్తుంది.రైతులకు ఉచిత న్యాయ సహాయం భూ సమస్యల పరిష్కారంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతులకు ప్రభుత్వం ఉచిత న్యాయ సహాయం అందజేస్తుంది.జిల్లాల్లో న్యాయ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి అని అన్నారు.అప్పీల్ వ్యవస్థ భూ హక్కుల రికార్డుల్లో సమస్యలు ఉంటే, రైతులు ఎమ్మార్వో,ఆర్డీవో,కలెక్టర్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చు. అవసరమైతే భూ ట్రైబ్యునల్స్‌కి కూడా అప్పీల్ చేయవచ్చు గ్రామాల్లో సేవలు భూ భారతి చట్టం అమలుతో గ్రామాల్లో రెవెన్యూ అధికారులు రైతుల ఇళ్ల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుంటారు.రైతులు ఆఫీస్ చుట్టూ తిరగకుండా,సులభంగా సేవలు పొందగలుగుతారు.భూ ఆధార్ కార్డులు ప్రతి కమతానికి భూ ఆధార్ కార్డులు జారీ చేస్తారు.ఇది భూమి హక్కుల గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది.భూ భారతి పోర్టల్ ఈ చట్టం కింద భూ భారతి పోర్టల్ ప్రారంభించబడింది.ఇందులో భూమి రికార్డులు,రిజిస్ట్రేషన్,మ్యుటేషన్ వంటి సేవలు ఆన్లైన్‌లో అందుబాటులో ఉంటాయి.మొదటిగా నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి,జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.అధికారుల బాధ్యతలు భూముల రిజిస్ట్రేషన్ సమయంలో తప్పులు చేస్తే,అధికారులు కఠిన చర్యలకు గురవుతారు. అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగింపు కూడా జరుగుతుంది.భూ భారతి చట్టం ముఖ్య లక్షణాలు అంశం వివరాలు అమలులోకి వచ్చిన తేదీ14 ఏప్రిల్ 2025 రికార్డుల నిర్వహణ భూముల సర్వే,మ్యాప్ తయారీ, రిజిస్ట్రేషన్,మ్యుటేషన్ సాదా బైనామా పరిష్కారం పెండింగ్ దరఖాస్తులకు పరిష్కారం అప్పీల్ వ్యవస్థ ఎమ్మార్వో,ఆర్డీవో,కలెక్టర్,ట్రైబ్యునల్ వరకూ న్యాయ సహాయం ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతులకు ఉచిత న్యాయ సహాయం భూ ఆధార్ కార్డులు ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు కార్డు

సేవల అందుబాటులోకి రాక భూ భారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్ సేవలు,గ్రామాల్లో రెవెన్యూ అధికారుల ఇంటి వద్ద సేవలు

అధికారుల బాధ్యతలు తప్పులు చేసిన అధికారులపై కఠిన చర్యలు,ఉద్యోగం నుంచి తొలగింపు కూడా కలిగి ఉంటుంది అని అన్నారు.స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు మాట్లాడుతూ..భూ భారతి చట్టం ద్వారా తెలంగాణలో భూ పరిపాలన వ్యవస్థను మరింత సులభతరం చేసి,రైతుల భూ హక్కులను మరింత బలపరచడం,వివాదాల నివారణ చేయడం లక్ష్యంగా ఉంది.ఈ చట్టం రైతులకు,భూమి హక్కుదారులకు చుట్టంగా,వారి సమస్యలకు సమగ్ర పరిష్కార మార్గాలను చూపిస్తుందని అన్నారు గత పాలకులు కేవలం కమిషన్ల కోసమేతాపత్రయపడ్డారు.తప్ప ధరణి అనేక రైతులు భూ సమస్యలకు గురి అయ్యారని అలాంటి సమస్యలు ఉండొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టాన్ని తీసుకొచ్చారని తెలియజేశారు.ఇట్టి కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో శేషగిరిరావు,ఎంపీడీవో శంకరయ్య,ఏఓ పాండురంగ చారి,అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జోజి,మోత్కూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి,డైరెక్టర్లు విద్యాసాగర్,సోమయ్య, అడ్డగూడూరు మండలం వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.