భీమేశ్వ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల 28 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. టౌన్ లో న్యూ హౌసింగ్ బోర్డ్ జింకలపల్లి భీమేశ్వర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి . వారి స్వగృహం చేరుకుని ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం కె.టి దొడ్డి మండల పరిధిలోని పాతపాలెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త చాంద్ పాషా అనారోగ్యంతో బాధపడుతున్న మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి . వెంటనే వారి ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించడం.
ఎమ్మెల్యే వెంట జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటన్న గౌడ్, కృష్ణ, ఆంజనేయులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.