భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, ల స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం....

Mar 16, 2024 - 21:13
 0  10
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, ల స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం....

మునగాన 17 మార్చి 2024

 తెలంగాణ వార్తా ప్రతినిధి :-

 దేశం కోసం ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ యువ కిశోరాలు షహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 93వ వర్ధంతి సందర్భంగా పోస్టర్ ను కోదాడ పట్టణంలో పి డి ఎస్ యు- పివైఎల్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవి, పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి మాట్లాడుతూ దేశంలో మతోన్మాదం, ఫాసిజం రోజురోజుకీ పెరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో విఫలం అయ్యారని విమర్శించారు. ఉద్యోగ ,ఉపాధి, వైద్య అవకాశాలు లేక యువకులు పెడదారి పడుతున్నారు అని అన్నారు. దేశ పునర్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. సామ్రాజవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్వేచ్ఛా, స్వతంత్రం కోసం, దోపిడీ, పీడనలేని నూతన వ్యవస్థ కోసం, యువతి యువకులు తిరుగుబాటుకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలోని ప్రధాన సమస్యలను ప్రజలు ప్రశ్నించకుండా వారి మధ్య ఆంక్షలు పెట్టి, మతం పేరుతో రెచ్చగొడుతున్నారని విమర్శించారు. భగత్ సింగ్ ఇచ్చిన ప్రేరణతో బిజెపి మతోన్మాద పాలనకు వ్యతిరేకంగా యువతరం, విద్యార్థి లోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ దేవ్ వర్ధంతులను గ్రామ గ్రామాన జరపాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ రైతాంగ పోరాటానికి మద్దతుగా యువతరం ఉద్యమించాలని అన్నారు. పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఈ విధానాలపై పోరాటాలు చేయాలని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి బుద్ది చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా నాయకులు బాదె నాగరాజు, పి డి ఎస్ యు జిల్లా నాయకులు వేణు, యశ్వంత్, సిద్దు, శివ, భరత్, రాము, సైదులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State