బోరింగ్ తండాల్ లో మద్యం బెల్ట్ షాపులకు నోటీసులు
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ బోరింగ్ తండాల్ లో మద్యం బెల్ట్ షాపులకు నోటీసులు* ఆత్మకూర్ ఎస్.. మద్యం మహామ్మారి తో తో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా ఆగమవుతున్నాయని గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలంటూ గ్రామ మద్యపాన నిషేధ కమిటీ సభ్యులు స్థానిక పంచాయితి కార్యదర్శి మంజుల కు గురువారం వినతి పత్రం అందజేశారు. స్థానిక పంచాయతీ సెక్రెటరీ గ్రామంలో నిర్వహిస్తున్న బెట్టి షాపుల వారికి నోటీసులు అందజేశారు. మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలంటూ గ్రామస్తులు తీర్మానం మేరకు గ్రామంలో మధ్యాన్ని అమ్మకూడదని అతిక్రమించి ఎవరైనా అమ్మినట్లయితే ఆప్కారి శాఖ సహకారంతో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి బెల్ట్ షాపుల వారికి నోటీసుల అందజేశారు.