బొగ్గు కురుమయ్య ఆధ్వర్యంలో హర్ ఘర్ - తిరంగా యాత్ర జెండాను ఎగరవేసిన

అసెంబ్లీ కో కన్వీనర్ అన్వేష్

Aug 10, 2026 - 19:31
Aug 11, 2026 - 00:08
 0  1
బొగ్గు కురుమయ్య ఆధ్వర్యంలో హర్ ఘర్ - తిరంగా యాత్ర జెండాను ఎగరవేసిన

10-08-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

చిన్నంబావి మండల బిజెపి సీనియర్ నాయకుడు గూడెం వెంకట్ రెడ్డి కాంప్లెక్స్ లో హర్ ఘర్ తిరంగా  - తిరంగాయాత్ర

 కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న - అసెంబ్లీ కో కన్వీనర్ అన్వేష్.కొల్లాపూర్ బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ గౌరవనీయులు ఎల్లేని సుధాకర్ రావు గారి సూచన మేరకు మండల అధ్యక్షులు బొగ్గు కుర్మయ్య అధ్యక్షతన జరిగినటువంటి మండల కార్యవర్గ కార్యక్రమంజెండాను ఎగురవేసిఆ తరువాతహర్ ఘర్ కార్యక్రమం లో భాగంగా.. అసెంబ్లీ కో కన్వినర్ అన్వేష్  త్రివర్ణ పథకాని పార్టీ ఆఫీస్ పై ఎగురవేసి,తను మాట్లాడుతూఈ రోజు మనందరం ఒక గొప్ప దేశభక్తి కార్యక్రమం కోసంఇక్కడ సమావేశమయ్యాం.

“హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర”లో ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశం రావడం నాకు ఎంతో గర్వంగాఉంది అని తెలియజేయడం జరిగింది.ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చిన్నంభావి బిజెపి నాయకులకు ప్రతి ఒక్కరికీ నా అభినందనలు.మన జాతీయ జెండా కేవలం ఒక జెండా కాదు.మన త్రివర్ణ పతాకం 140 కోట్ల భారతీయుల గౌరవానికి ప్రతీక.ఈ జెండా ఎగురుతున్నప్పుడు మనకు స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులుగుర్తుకు రావాలి.ఎంతోమంది తమ జీవితాలను, తమ కుటుంబాలను, తమ భవిష్యత్తును దేశం కోసం త్యాగం చేశారు.వారి త్యాగాల ఫలితంగానే మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం అని అన్నారు.

మన త్రివర్ణ పతాకంలోని కాషాయం ధైర్యం, త్యాగానికి… తెలుపు శాంతి, సత్యానికి… ఆకుపచ్చ అభివృద్ధి, సుసంపన్నతకు ప్రతీక.

మధ్యలో ఉన్న అశోక చక్రం మన దేశం ఎప్పటికీ ముందుకు సాగాలని సూచిస్తుంది.అందుకే “హర్ ఘర్ తిరంగా” అంటే ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయడంమాత్రమే కాదు…ప్రతి ఇంట్లో దేశభక్తి ఉండాలి.ప్రతి ఒక్కరి మనసులో భారతదేశం పట్ల గౌరవం ఉండాలి.ప్రతి యువకుడిలో దేశం కోసం ఏదైనా చేయాలనే సంకల్పం ఉండాలి.మన దేశం అభివృద్ధి చెందాలంటే యువత ముందుకు రావాలి.విద్యలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, వ్యవసాయంలో, సాంకేతిక రంగంలో మన యువత సాధించే ప్రతి విజయం భారతదేశ విజయం.దేశం కోసం పనిచేసిన మహనీయులను స్మరించుకుందాం.మన భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా నిర్మించడంలో మన వంతు పాత్ర పోషిద్దాం. “జెండా మన చేతిలో ఉండటం మాత్రమే కాదు… దేశం మన గుండెల్లో ఉండాలి!

అని మాట్లాడటం జరిగింది....ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి సంపత్ మండల ఉపాధ్యక్షులు గణేష్ రెడ్డి , గోపినాయుడు  ,జిల్లా ఓబీసీ కార్యదర్శి చెన్నయ్య యాదవు,అదేవిధంగా కేతేపల్లి బిజెపి వార్డ్ మెంబర్ ఎజ్జు రాజేష్ నాయకులు గూడెం భగవాన్ సాగర్,వెంకటన్న, మండ్ల గోపి,రామకృష్ణ,బాలయ్య,మిగతా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State