బైక్ డిక్కీలో నగదు చోరీ

తిరుమలగిరి 07జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని పట్ట పగటి వేల చోరీ జరిగింది బైక్ డిక్కీలో నుండి గుర్తుతెలియని వ్యక్తులు నగదు చోరీ చేశారు ఈ ఘటన తిరుమలగిరి మండలం ఫణిగిరి గ్రామానికి చెందిన తాటిపల్లి శ్రీను అనే వ్యక్తి తన బైక్ డిక్కీలో లక్ష 83 వేల నగదును పెట్టుకొని తిరుమలగిరి చౌరస్తాలో జిరాక్స్ సెంటర్ దగ్గర బైక్ పార్క్ చేశాడు జిరాక్స్ సెంటర్ ముందు పార్కు చేసి లోపలికి వెళ్లి తిరిగి వచ్చేసరికి డిక్కీలో నుండి నగదు కనిపించలేదు దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఈ ఘటన జరిగిన ప్రదేశాన్ని నాగారం సిఐ రఘువీర్ రెడ్డి మరియు తిరుమలగిరి ఎస్సై సురేష్ సందర్శించారు