బెల్ట్ షాప్ యజమాని బైండోవర్
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మండలంలోని గట్టికల్లు గ్రామంలో ఈనెల 2తారీఖు నుండి గాంధీ జయంతి సందర్భంగా గ్రామంలో సంపూర్ణ మద్యం నిషేధించాలని గ్రామస్తులు తీర్మానించారు . ఈ నెల 14వ తారీకు నుండి సంపూర్ణ మధ్యపాన నిషేధం గ్రామంలో అమలు అవుతుంది. సోమవారం రాత్రి తన్నీరు యాదగిరి బెల్ట్ షాపు యజమాని మద్యం విక్రయిస్తుండగా గ్రామస్తులు చూసినారు. గ్రామo లో సంపూర్ణ మధ్య నిషేధం అమల్లో ఉన్న మద్యం విక్రయిస్తున్నందుకు అతని ఇంటి ముందు గ్రామస్తులు ధర్నా చేయడం జరిగింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వటం తో గట్టి కల్ గ్రామానికి చేరుకొని అతనిని రెండు లక్షల పూచికత్తూ తో బైండోవర్ చేశామని స్టేషను హౌస్ ఆఫీసర్ రత్నావత్ శంకర్ నాయక్ తెలిపారు. దీంతో గ్రామస్తులు ధర్నాను విరమించారు.