బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై సీఎం రేవంత్ రెడ్డి కృషి చారిత్రాత్మకo

సురేష్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు
తెలంగాణ వార్త మిర్యాలగూడ మార్చి19: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల కేంద్రంలో ఈరోజుస్థానిక విద్య ఉద్యోగ రంగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి చారిత్రాత్మక మని బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు కొర్ర పిడత సురేష్ యాదవ్ అన్నారుబుధవారం స్థానిక సమావేశంలో మాట్లాడుతూ సోమవారం అసెంబ్లీలో బీసీలకు స్థానిక విద్య ఉద్యోగ రంగాలలో 42 శాతం రిజర్వేషన్ల కు సంబంధించిన బిల్లులకు తెలంగాణ శాసన సభ ఆమోదానికి కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఆమోదించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏ అంశాలు ప్రస్తావించారో అవే అంశాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఒక్కొకటి గా వాటి అమలుకి కృషి చేస్తున్న తీరు ప్రశంసనీయం అని భవిష్యత్తులో రేవంత్ రెడ్డి నాయకత్వములో తెలంగాణ నుండే గొప్ప సాంఘీక విప్లవం రాబోతుంది అని బడుగు బలహీన వర్గాలకు అది ఎంతో మేలు చేస్తుంది అని బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.