బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
రేవంత్ రెడ్డిది నరహంతక భాష
బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
జోగులాంబ గద్వాల 12 జూలై 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఒక వీధి రౌడీలా మాట్లాడుతున్నాడు.
ఒక తుగ్లక్‌లా ప్రవర్తిస్తూ.. హింసను ప్రేరేపించే నరహంతక భాషను వాడుతూ ప్రజలను, విపక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు
రైతుల కోసం కన్నెపల్లి పంపులను ఆన్ చేయమంటే... ప్రతిపక్షాల గొంతులు కోస్తామంటూ రేవంత్ రెడ్డి ఉన్మాద వ్యాఖ్యలు చేస్తున్నాడు
ఇంతటి క్రూరమైన, అహంకారపూరిత దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేడు
నోటికొచ్చినట్లు వాగుతూ... శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రేవంత్ రెడ్డిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన మహానీయుడు మా కేసీఆర్ . ఆయనపై రేవంత్ రెడ్డి జుగుప్సాకరమైన, నీచమైన వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు
వర్షాలు లేక, సాగునీరు అందక చేతికొచ్చిన నారుమడులన్నీ కళ్లముందే ఎండిపోతుంటే రైతులు లబోదిబోమంటున్నారు.
ఈ చేతకాని తుగ్లక్ కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారాన్ని పక్కనబెట్టి... వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
రేవంత్ రెడ్డి పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని అన్నారు. అందుకే ఫ్యాక్షన్ రాజకీయాలకు దిగుతున్నారని ఆరోపించారు. రాజధానికి కూత వేటు దూరంలో ఒకే గ్రామంలో ఆరుగురు హత్యకు గురై 24 గంటలు గడిచిన నిందితులను గుర్తించలేని అసమర్ధ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ది అని అన్నారు. ఈ ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను లక్ష్యంగా చేసుకొని క్రిమినల్ భాషలో మాట్లాడడం దుర్మార్గమని మండిపడ్డారు.