బిఎల్ఓ సుజాత పనితీరు ప్రశంసనీయం..
విజయవంతంగా ఎనుమేరేషన్ పూర్తి చేసిన సుజాతకు అభినందనలు..
సూర్యాపేట : బిఎల్ఓ సుజాత పనితీరు ప్రశంసనీయం ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడంలో బూత్ లెవల్ ఆఫీసర్ (బిఎల్ఓ) పాత్ర ఎంతో కీలకం.. ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపులు వంటి బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు.విధి నిర్వహణలో అంకితభావం, సమయపాలన, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ బిఎల్ఓ ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. వారి సేవ నిజంగా ప్రశంసనీయమైనవి.సూర్యాపేట పట్టణ పరిధిలోని 7వ వార్డు పిఎస్ నెంబర్ 82 బూత్ లెవల్ ఆఫీసర్ (బిఎల్ఓ)గా విధులు నిర్వహిస్తున్న తంతెనపల్లి సుజాత,బిఎల్ఎ ల సహాయంతో ఎన్నికల సంఘం చేపట్టిన ఎనుమేరేషన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను సోమవారం విజయవంతంగా పూర్తి చేశారు. ఇంటింటికి వెళ్లి అర్హులైన ఓటర్ల వివరాలను సేకరించడం, అవసరమైన పత్రాలను పరిశీలించడం, ఓటరు జాబితా నవీకరణలో నిబద్ధతతో పనిచేయడం ద్వారా విధులను సమర్థవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె పనితీరును తాసిల్దార్ సాయి గౌడ్, డిప్యూటీ తాసిల్దార్ లాలు నాయక్ లు అభినందించారు.ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడంలో బిఎల్ఓల పాత్ర కీలకమని, తంతెనపల్లి సుజాత అదే బాధ్యతతో డిస్ట్రిబ్యూషన్ మొత్తం 952, ఆన్లైన్ కంప్లీటెడ్ 825, ఆన్లైన్ ఓట్లు03,డెత్, షిఫ్టింగ్, డిలేట్ 124 ఓట్లు 100 శాతం పూర్తి చేసి ప్రతి ఒక్క ఇంటికి స్టికర్ అతికించి సమర్థవంతంగా నిర్వర్తించి ఎనుమేరేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వెంకటేశ్వర్లు, బి ఎల్ఓ లు బొజ్జ అనిత, ఉషారాణి,గట్టు రమ్య, బిఎల్ఎ దైద కృష్ణ,వీర్జాల వేణు, పాల్గొన్నారు.