బలవత్మరణం పాల్పడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
అడ్డగూడూరు జూలై 05 జూలై 2024తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని కోటమర్తి గ్రామానికి చెందిన మందుల వంశీ అలియాస్ ఎల్లేష్ (21) జెసిపి డ్రైవర్ గా గ్రామంలో పనిచేస్తున్నాడు.అదే గ్రామానికి చెందిన మాజీ ఇంచార్జ్ సర్పంచ్ చిప్పలపల్లి బాలయ్య వ్యక్తిగతంగా తన పనికి సహకరించలేదని బెదిరింపులకు పాల్పడగా గత నెల జూన్ 15తేదీన మందుల వంశీ అనే జెసిబి డ్రైవర్ (ఎల్లేష్) గడ్డి మందు సేవించి బలవత్మరణానికి పాల్పడ్డాడు.
ఇట్టి విషయంపై జూన్ 18 వ తారీఖున అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో బాధిత ఎల్లేష్ కుటుంబ సభ్యులు బెదిరింపులకు గురి చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేశారు.ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఎల్లేష్ చెప్పిన మాటల్ని రావన్నపేట జడ్జి ఆడియో,వీడియో రికార్డులను వాంగ్మూలంగా తీసుకున్నారని తెలిసింది.ఇట్టి విషయంపై గతంలో అడ్డగూడూరు ఎస్సైని వివరణ కోరగా బెదిరింపుకు పాల్పడడంతో గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని వంశీ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని,కేసు నమోదు చేసినట్లు,జడ్జికి వాంగ్మూలం ఇచ్చిన మాట నిజమేనని తెలిపారు.
20రోజులుగా చికిత్స పొందుతున్న వంశీ అలియాస్(ఎల్లేష్ )జూలై 5వ తేదీన హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్లో మృతి చెందాడని కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపారు.తన తమ్ముడి మరణానికి బెదిరింపుతో కారకుడైన మాజీ ఇంచార్జి సర్పంచ్ బాలయ్య పై మృతుని సోదరుడు మందుల సాయికుమార్ అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో జూన్ 18న కారకులు పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారని అడ్డగూడూరు సబ్ ఇన్స్పెక్టర్ డి.నాగరాజు తెలిపారు.మృతుడు ఎల్లేష్ గతంలో ఫోక్సో చట్టం కింద బాధితుడుగా జైలుకు వెళ్లి రావడం జరిగిందని అట్టి కేసు కొనసాగుతూనే ఉందని ఈ క్రమంలో గ్రామంలో బెదిరింపులకు కారణంగానే ఆత్మహత్య ప్రయత్నం మందుల వంశీ పాల్పడ్డాడని, కారకుడైన ఆరోపిత నిందితుడు బాలు పరారీలో ఉన్నట్లు సమాచారం.అధికార పార్టీ నాయకుడు కావడంతో అతని తప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయని,కారకుడైన బాధితుని అదుపులోకి తీసుకోవాలని పూర్తి వివరాలు పోలీసుల వెల్లడించాలని మృతుడు వంశీ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి నాయకున్ని ఉపేక్షించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు,ఎమ్మెల్యేకు తగదని నిండు ప్రాణాన్ని పరోక్షంగా బలి తీసుకున్న బాలు ను వదిలి పెట్టొద్దని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ డిమాండ్ చేశారు.ఈ విషయంపై పూర్తి వివరాలు పోలీసు దర్యాప్తులో తెలియ రావాల్సింది.