బడి బయట పిల్లలు పాఠశాలలో చేరేలా ప్రత్యేక కార్యాచరణ జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి.

Sep 21, 2024 - 19:43
 0  9
బడి బయట పిల్లలు పాఠశాలలో చేరేలా ప్రత్యేక కార్యాచరణ జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి.

జోగులాంబ గద్వాల 21 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-గద్వాల.జిల్లా కలెక్టర్  ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ - జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి/ గట్టు మండల ప్రత్యేక అధికారి Dr ప్రియాంక. 
శనివారము,  జిల్లా కలెక్టర్  ఆదేశాలనుసారం గట్టు, KT దొడ్డి మండలాలలో ఎక్కువ మంది విద్యార్థులు కాటన్ సీడ్ పనులకు వెళ్తున్నారని, అటెండన్స్ శాతం పడిపోతున్నందున ప్రత్యేకంగా "డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ & చైల్డ్ లేబర్" టీమ్ లు ఏర్పాటు చేసి, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి/ గట్టు మండల ప్రత్యేక అధికారి Dr ప్రియాంక ఆధ్వర్యంలో డ్రాప్ ఔట్ పిల్లలను బడికి పంపాలని ZPHS ఆలూర్ పత్తి పొలాల్లో మండల అధికారులు పర్యటించి తల్లి దండ్రులకు పిల్లలను బడికి పంపాలని మోటివేషన్ చేసారు. అదే విధంగా ZPHS అలూర్ లో పేరెంట్స్ - టీచర్స్ సమావేశంలో జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి, తహసీల్దార్, MPDO, MEO పాల్గొని, పిల్లల భవిష్యత్తు కై కెరీర్ గైడెన్స్, మోటివేషన్ క్లాసెస్ నిర్వహించి, ఇటు తల్లి దండ్రులకు మరియు విద్యార్థులకు దిశ నిర్దేశం చేశారు. మరియు తదనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

ఇట్టి కార్యక్రమంలో తహసీల్దార్ సరిత రాణి , MPDO చెన్నయ్య, MEO నరసింహ, GHM నాగరాజు,  నీతి అయోగ్ కో ఆర్డినేటర్ అఫ్జల్, DWO సూపర్వైజర్ తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333