ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు ,కొన్ని పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇక్కట్లు
జోగులాంబ గద్వాల ఫిబ్రవరి 28 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమాయ్యయి. బుధవారం మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్ద హాజరైయ్యారు. జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలలో మొదటి సంవత్సరం 3,990 మంది, రెండవ సంవత్సరం 4,575 మంది విద్యార్థులు మొత్తం 8, 567 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టారు..కొన్ని పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండాకాలం దృష్టిలో ఉంచుకుని తాగునీటి వైద్య సిబ్బందిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు..