ప్రవైట్ మెడికల్ మాఫియా పై ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం

Mar 7, 2025 - 19:48
Mar 7, 2025 - 19:49
 0  4
ప్రవైట్ మెడికల్ మాఫియా పై ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం

బహుజన్ సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి నాగేశ్వరావు.

ఖమ్మం : బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో ది:09-03-2025 ఆదివారం ఉదయం 11:00 గంటలకు ఖమ్మం నగరంలో జరుగుతున్న ప్రవేట్ ఆసుపత్రిల మెడికల్ మాఫీయా పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి నాగేశ్వరావు తెలిపారు . శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం పట్టణంలో మెడికల్ హాస్పిటల్ దందా , మెడికల్ మాఫియాకు అడ్డు అదుపులేదని , నియంత్రించాల్సిన అధికారులు నిమ్మకు నీరు ఎత్తనట్టుగా ఉన్నారని , గ్రామాల నుంచి వచ్చే రోగుల దగ్గర వేల రూపాయల దగ్గర నుంచి మొదలుకొని లక్షల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు . అవసరం లేకపోయినా అనేక టెస్టుల పేర్లతో దోపిడీ చేస్తున్నారని , అనేక లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఆడ శిశువులను హత్య చేస్తున్నారని మండిపడ్డారు . ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల నాగరాజు , జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లెపొంగు విజయకుమార్ , పాలేరు అసెంబ్లీ అధ్యక్షుడు మట్టే నాగేశ్వరరావు లు పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333