ప్రమాదాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన అధికారులు

tirumalagiri news

Jul 25, 2026 - 22:04
Jul 26, 2026 - 01:49
 0  4
ప్రమాదాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన అధికారులు

తిరుమలగిరి, 26 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- మండల పరిధిలో జాతీయ రహదారి (NH-930P) పై బ్లాక్ స్పాట్స్ సమస్యల పరిష్కారానికి శనివారం తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు.తిరుమలగిరి సబ్ ఇన్‌స్పెక్టర్  వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నేషనల్ హైవే ప్రాజెక్ట్ మేనేజర్ బి. రామ్‌కుమార్, తొండ గ్రామ సర్పంచ్  బి. స్వాతి, మరియు అనంతారం గ్రామ వార్డు కౌన్సిలర్  గొడిశాల అంజయ్య గౌడ్‌లతో కలిసి సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా తొండ గ్రామం మరియు అనంతారం స్టేజ్ వద్ద గల జాతీయ రహదారి దిగ్బంధన ప్రాంతాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చేపట్టాల్సిన తాత్కాలిక మరియు శాశ్వత నివారణ చర్యలపై ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు గాను సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో అవసరమైన అన్ని చర్యలు వేగవంతంగా తీసుకుంటున్నట్లు తెలిపారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి