*ప్రభుత్వ భూమిని..... గ్రీన్ బెల్ట్ స్థలంగా ఖరారు చేశారా.....!?
*కూసుమంచి ఎఫ్ టి ఎల్ పరిధిలో భూమికి లేఅవుట్ అనుమతులు:-
*డిటిపిసి అనుమతులకు ముందు...? పత్రాల సమర్పణ
సజావుగా సాగిందా....?
*ఏదైనా వెంచర్ లేఅవుట్కు... అన్ని శాఖల ఎన్ఓసి తప్పనిసరి కాదా...?
*ప్రభుత్వ భూమినే... గ్రీన్ బెల్ట్ స్థలంగా ఖరారు చేశారా...?
*బటర్ఫ్లై సిటీ.. వాటర్ ట్యాంక్ నిబంధనల ప్రకారం పదిలమేనా...?
*జయభేరి.. శ్రీనిధి సంస్థ లేఔట్ వ్యవహారంలో.. అసలు ప్రభుత్వ నిబంధనలను పాటించారా...?
నేషనల్ హైవే 365 పక్కన *లేఅవుట్లకు చేతులు మారిన లక్షలాది రూపాయలు...?
తెలంగాణ వార్త నిఘా సంచలన కథనం...1
తెలంగాణ వార్త : ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రతినిధి/సెప్టెంబర్ 09/
పాలేరు నియోజకవర్గంలో మొన్న నేలకొండపల్లి.. నేడు కూ సుమంచి మండల కేంద్రానికి సమీపంలోని పాలేరు టోల్గేట్ సమీపంలో జయ భేరి శ్రీనిధి సంస్థ నేషనల్ హైవే 365 పక్కన టోల్గేట్ సమీపంలో ఓ వెంచర్ను ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు కొల్లగొట్టిన ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కాగా ఎఫ్ టిఎల్ పరిధిలోని ప్రభుత్వ భూములకు సైతం లేఅవుట్ మంజూరు చేసిన అధికారుల ఉదాసీనతపై పలు విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఓ కార్పొరేట్ సంస్థకు ఎఫ్టిఎల్ పరిధి లోని ప్రభుత్వ భూమికి లేఅవుట్ అనుమతులు ఇవ్వడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతోపాటు లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూసుమంచి మండల పరిధిలోని పాలేరు సమీపంలో టోల్గేట్ వద్ద ఓ సంస్థ సుమారు 65 ఎకరాలలో లేఅవుట్ అనుమతులు పొంది వెంచర్నిర్మానం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదైనా వెంచర్కు లే అవుట్ అనుమతులు పొందాలంటే ముందుగా డిటిపిసి అనుమతులకు ముందు ల్యాండ్ ఓనర్ షిప్ రెవెన్యూ రికార్డులు సర్టిఫికెట్స్ క్లియరెన్స్ లేఔట్ అనుమతులు కనీసంలో కనీసం గా 12 వేల గజాలు కనీసం ఉండాలని ప్రభుత్వ నిబంధనలు సూచిస్తున్నాయి. కాగా గేటెడ్ కమ్యూనిటీ క్రింద ప్రహరీ గోడ గేటు డ్రైనేజ్ కరెంటు మెయిన్ రోడ్లు అంతర్గత రోడ్లు నిర్మాణానికి మ్యాపు తో సహా అనుమతులు కొరకు ప్రతిపాదనలు తయారుచేసి రెవెన్యూ హెల్త్ విద్యుత్ ఫైర్ మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ లేదా కార్పొరేషన్ పారేస్తూ నీటిపారుదల ఆర్ అండ్ బి పర్యావరణ శాఖల నుండి ఎన్వోసీ పొందాల్సి ఉంటుంది. అనంతరం ఆయా జిల్లా కలెక్టర్లు చైర్మన్ గా నిధులు నిర్వర్తించే విభాగం అనుమతి తప్పనిసరి అని సంబంధిత అధికారులే అంగీకరిస్తున్న వైనం. ఇటువంటి అనుమతులు పొందడానికి కనీసంలో కనీసం 30 నుండి 45 రోజులు డి టిపిసి అనుమతులు పొందడానికి దరఖాస్తుదారులకు కాలపరిమితి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయా లే అవుట్లలో ఫైర్ సేఫ్టీ విద్యుత్ సౌకర్యం మంచినీటి సౌకర్యం మెయిన్ రోడ్లతోపాటు నిర్ణీత కొలతలతో రోడ్ల నిర్మాణం తో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకుగాను మొక్కల పెంపకాన్ని చేసి సం రక్షించాల్సిన బాధ్యత ఆయా వెంచర్ల నిర్వాహకులకు కనీస బాధ్యతగా ఉంటుందని పలువురు అంటున్నారు. ఆయా వెంచర్లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీలు అయితే 10 శాతం మేర పార్కు నిర్మాణం పీహెచ్సీ బడి లేదా గుడి డ్రైనేజీలు తదితర కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. కానీ జయభేరి శ్రీనిధి సంస్థ ఇటువంటి నిబంధనలను పాటించకపోగా ఎఫ్ టిఎల్ పరిధిలోని ప్రభుత్వ భూములకు అక్రమంగా లేఅవుట్లు అనుమతులు పొందినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. ఓ చెరువు సమీపంలో ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా లే అవుట్ అనుమతులు పొందడంపై అధికారుల ఉదాసీనత పై పలు ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. లేఅవుట్ ప్రహరీ గోడ నుండి కనీసం 40 అడుగులు దూరం ఉండాలని హైవే రోడ్డుకు 60 అడుగులు దూరాన్ని పాటించాల్సి ఉంటుందని వెంచర్లలో 33 అడుగుల అంతర్గత రోడ్లు 40 60 అడుగుల వెడల్పుతో మెయిన్ రోడ్ లనిర్మాణం ఉండాలని పలువురు అంటున్నారు. కానీ అక్రమంగా అనుమతులు సంపాదించి ప్రభుత్వ భూమిని సైతం లేఔట్ లో గ్రీన్ బెల్ట్ గా చూపించి లక్షలాది రూపాయల అవినీతికి పాల్పడినట్లు పలువురు మండల ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. కాగా పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి మండలంలో కోట్లాది రూపాయల గ్రీన్ బెల్ట్ స్థలాలను ఎగవేతలతో పాటు గ్రీన్ బెల్ట్ స్థలాన్ని దర్జాగా వ్యాపారం చేస్తూ చేతులు మారిన వ్యవహారం మరువకముందే పాలేరు నియోజకవర్గంలో పాలేరు సమీపంలో జయభేరి శ్రీనిధి సంస్థ అక్రమ లేఅవుట్ వ్యవహారంలో తవ్వినాకొద్ది అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు ప్రభుత్వ రికార్డులనుసరించి తెలుస్తోంది.
*జయభేరి శ్రీనిధి సంస్థ అక్రమ లేఅవుట్ వ్యవహారంపై... అధికారుల వివరణలు.. మరికొన్ని అంశాలతో.. రేపటి కథనం...2లో...?