ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్ పి వి వ్యాక్సిన్ కార్యక్రమం
జోగులాంబ గద్వాల 28 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- డిఎంహెచ్వో డాక్టర్ సంద్యా కిరణ్ మై ఆదేశాల మేరకు... ఇమ్నైజేషన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మహమ్మద్ అజ్గర్ అలీసార్. ఆధ్వర్యంలో..... ఈ రోజు మంగళవారం స్థానిక పాత బస్టాండ్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు HPV వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 14 -15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నివారణకు సంబంధించిన HPV వ్యాక్సిన్ వేశారు. పాఠశాలలో మొత్తం 289 మంది బాలికలు ఉండగా, వారిలో 158 మంది బాలికలకు వ్యాక్సిన్ విజయవంతంగా వేయించారు. మిగతా బాలికల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి త్వరలోనే వ్యాక్సిన్ వేయించేందుకు చర్యలు తీసుకుంటామని పాఠశాల అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డా. శరణ్య, MCH హెల్త్ సూపర్వైజర్ సుబ్బలక్ష్మి, ANM లు గ్రేస్, అజుబా, ASHA కార్యకర్తలు వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. పాఠశాల హెడ్మాస్టర్ జహరుద్దీన్, టీచర్ విజయలక్ష్మి మరియు ఇతర ఉపాధ్యాయులు సహకరించారు. వ్యాక్సిన్ వేసుకున్న బాలికలను 30 నిమిషాల పాటు పరిశీలించిన అనంతరం ఇంటికి పంపించారు.