ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కు నూతన మార్గదర్శకాలు విడుదల చేయాలి

Sep 21, 2024 - 22:58
Sep 21, 2024 - 23:04
 0  14
ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కు నూతన మార్గదర్శకాలు విడుదల చేయాలి

రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్

*(సూర్యాపేట టౌన్ సెప్టెంబర్* *21* ) ఎకరంలోపు ఉన్న భూములకు నాల కన్వర్షన్ మీదనే రిజిస్ట్రేషన్లు చేసేలా ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేయాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీర స్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎకరం లోపు ఉన్న భూములను నాలా కన్వర్షన్ మీద రిజిస్ట్రేషన్ చేస్తే ఎంతోమందికి ఉపయోగముంటుందని చెప్పారు. ధరణి వెబ్సైట్లో పాత డిజిటల్ యాప్ ను తీసేశారు. అలా తీయడం వల్ల సర్టిఫై కాపీలు ఆన్లైన్లో రావట్లేదు. అవి బ్యాంకు లోన్ గాని వ్యక్తిగత పనులకు గాని అవసరం ఉంటది. ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. పది వేలు కట్టిన ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ఆయన అన్నారు. సూర్యాపేట జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కులు ఐటీ అబ్ రంగాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. మున్సిపల్ కార్యాలయం ద్వారా గతంలో ఇంటి నెంబర్ ఇచ్చి అధికారులు ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో రిజిస్ట్రేషన్లు కాక యజమానులు ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారులు స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మౌలిక వస్తువులు లేక నిత్యం కార్యాలయం పనుల మీద వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. జిల్లా కేంద్రంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం కోసం కృష్ణానగర్లో గతంలోనే 8 గుంటల స్థలాన్ని గుర్తించారని ,భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి అన్ని మౌలిక వస్తువులు కల్పించి నిర్మాణం చేపట్టాలని అన్నారు. కార్యాలయాల్లో సిబ్బంది ని పెంచి ప్రజలకు మరింత చేరువగా పరిపాలన అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ ఉపాధ్యక్షుడు పట్టణ గౌరవ సలదారుడు మండాది గోపాల్ రెడ్డి బానోతు జానీ నాయక్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333