ప్రధానోపాధ్యాయుడు పి వెంకటాద్రికి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక అభినందనలు
అడ్డగూడూరు 23 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు (హెడ్మాస్టర్) పి వెంకటాద్రి విద్యార్థుల పట్ల చూపుతున్న సేవాభావం నిజంగా ఆదర్శనీయం. తన విధులు నిర్వహిస్తున్న వివిధ గ్రామాల నుండి లక్ష్మీదేవికాల్వ,ధర్మారం, గట్టుసింగారం, మానాయకుంట గ్రామాల నుండి అడ్డగూడూరు వరకు పాఠశాలకు రావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారుల కోసం,తన సొంత ఖర్చులతో ఉచితంగా ఆటో ఏర్పాటు చేసి ప్రతిరోజూ వారిని పాఠశాలకు తీసుకువస్తూ.. తిరిగి పంపిస్తూ.. విద్యకు అండగా నిలుస్తున్నారు. ఇది కేవలం ఒక విధి నిర్వహణ మాత్రమే కాదు, విద్యార్థుల భవిష్యత్తుపై ఉన్న గొప్ప బాధ్యతాభావానికి నిదర్శనం. ఇలాంటి సేవా దృక్పథం కలిగిన ప్రధానోపాధ్యాయులు సమాజానికి ఆదర్శం. విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ స్వంత డబ్బును ఖర్చు చేస్తూ, విద్యపై ఆసక్తి పెంచుతున్న హెడ్మాస్టర్ కి విద్యార్థుల తల్లిదండ్రులు హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. తెలుపుతున్నారు. విద్యార్థుల కోసం సేవ చేయడం ఆలోచించే ఉపాధ్యాయులు కొంతమంది ఉంటారు. కానీ ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నంతకాలం సమాజానికి మంచి భవిష్యత్తు ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.