**ప్రతి తల్లి సంతోషంగా ఉండేలా తల్లికి"వందనం"అమలు చేస్తున్న నారా లోకేష్*

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి జగ్గయ్యపేట : తల్లికి వందనం పథకం వైఎస్ఆర్సిపి పార్టీకి మరణ శాసనం ప్రతి తల్లి సంతోషంగా ఉండేలా తల్లికి “వందనం” అమలు చేస్తున్న నారా లోకేష్*
జగ్గయ్యపేటలో తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి KDCC బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీరఘురామ్ గారు
ఇంట్లో ఎంతమంది విద్యార్ధులు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం కింద రూ.15 వేలు ఇస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్ధులకు తీరని ద్రోహం చేస్తున్నారు.
రూ.2 వేలు లోకేష్ జేబుల్లోకి పోయాయంటూ వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారు. దమ్ముంటే రుజువు చేయండి. ఆధారాలు లేని ఆరోపణలు చేయడమే వైసీపీ నేతల పని. కనీసం తల్లికి కూడా గౌరవం ఇవ్వలేని జగన్ రెడ్డి నేడు తల్లికి వందనం గురించి మాట్లాడడం సిగ్గుచేటు.
వైసీపీ పాలనలో రూ.13 వేలు ఇచ్చారు. అంటే రూ.2 వేలు జగన్ జేబుల్లోకి పోయాయా? తాడేపల్లి ప్యాలెస్‌కు చేరాయా?
జగన్ పాలనలో 42 లక్షల మందికి మాత్రమే ఇస్తే కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్ధులకు తల్లికి వందనం ఇస్తుంది.
ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బాబు నిలబెట్టుకున్నారు. ప్రతి విద్యార్ధికి తల్లికి వందనం వర్తింపు అవ్వాలని నారా లోకేష్ గారు కృషి చేస్తుంటే బులుగు ముఠా విష ప్రచారం చేస్తుంది.
నేడు విద్యార్ధుల తల్లుల ముఖాలు చిరునవ్వుతో వెలుగుతుందంటే కారణం నారా లోకేష్ గారు. వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోవడం చూసి ఓర్వలేకే ఈ తప్పుడు రాతలు, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంది ఈ ముఠా.
పిల్లల స్కూలు ఫీజు కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా నారా లోకేష్ గారు తల్లికి వందనం కార్యక్రమాన్ని తల్లులకు అందిస్తున్నారు.
కుటుంబంలో ఒక్కరికే అనే షరతు పెట్టి పేద, మధ్య తరగతి విద్యార్ధులను, వారి తల్లిదండ్రులను జగన్ మోహన్ రెడ్డి మానసికంగా వేధింపులకు గురి చేసిన విషయం వాస్తవం కాదా?
పారదర్శకంగా అమలు
67 లక్షల మంది విద్యార్థుల తల్లులకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. ఇందుకోసం రూ.8,700 కోట్లు విడుదల చేశాం. పాఠశాలలు తెరిచేలోగా పథకం అమలు చేస్తామని మాట ఇచ్చాం... దానిని నిలబెట్టుకున్నాం.
1వ తరగతిలోనూ, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ చేరే విద్యార్ధులకు కూడా ఈ పథకం అమలు చేస్తాం. వీరు సుమారు 11 లక్షల మంది వరకు ఉన్నారు. వీరి డేటా అప్లోడ్ కాగానే డబ్బులు వేస్తాం.
తల్లి లేని పిల్లలకు... వారి తండ్రికి కానీ, లేదంటే సంరక్షుల ఖాతాలో కానీ డబ్బులు జమ చేస్తాం.అలాగే అనాథలైన పిల్లలకు జిల్లా కలెక్టర్ నిర్ధారించిన తర్వాత పథకం వర్తింప చేస్తాం.
పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తాం.
లబ్దిపొందే విద్యార్ధుల్లో బీసీలు 29.82 లక్షల మంది ఉన్నారు...ఎస్సీ విద్యార్ధులు 11.76 లక్షల మంది, ఎస్టీ విద్యార్ధులు 4.26 లక్షల మంది, మైనారిటీ విద్యార్ధులు 66,500 మంది, ఈడబ్ల్యుఎస్ విద్యార్ధులు 8.44 లక్షల మంది ఉన్నారు.
ఒక బిడ్డ ఉన్నా... నలుగురు ఉన్నా... అందరికీ తల్లికి వందనం ఇస్తున్నాం.తల్లులు మోసం చేసింది జగన్ కాదా? “కేజి నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తాను.. ఎంతవరకు చదవుకుంటే అంతవరకు చదివిస్తాను.. మేనమామగా చెబుతున్నాను” అని మాటలు చెప్పి బడుగు బలహీన, మైనార్టీ వర్గాలకు చందిన 12 లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్‌ను నాశనం చేసింది మీరు కాదా?
2019 ఎన్నికల ప్రచారంలో “మీ ఇంట్లో ఇద్దరు పిల్లల్ని బడికి పంపండి ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ఇస్తాము” అంటూ భారతి రెడ్డి ప్రచారం చేయలేదా? అధికారంలోకి వచ్చాక ప్రతి కుటుంబంలో ఒక్క విద్యార్ధికే రూ.13వేలు ఇస్తామంటూ నాలుక మడతబెట్టింది నువ్వు కాదా జగన్ రెడ్డి?
పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హత ఉన్న ప్రతి విద్యార్ధికీ లబ్దీ చేకూరుస్తుంటే బెంగళూరులో కూర్చొని జగన్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నాడు.
ప్రతి విద్యార్ధి చదువుకునేందుకు దోహదపడే విధంగా నేరుగా వారి తల్లి/సంరక్షకుని ఖాతాలో డబ్బులు వేస్తుంటే స్వాగతించకుండా తప్పుడు ప్రచారాలు చేయడం జగన్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.
వైసీపీ హయాంలో ఈ పథకం కోసం కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు పెడితే.. కూటమి ప్రభుత్వం రూ.10 వేల కోట్లు మేరా ఖర్చు చేస్తూ విద్యార్ధుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది.
విద్యార్ధులకు పెట్టే చిక్కీలు, కోడుగుడ్డులు, కందిపప్పులో కూడా కమిషన్‌లు తీసుకున్న నీఛ చరిత్ర మీది.
గత ప్రభుత్వంలో అమ్మ ఒడి నిధులు ఎప్పుడు పడతాయా అని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు వేచి చూసేవారు. నేడు పాఠశాలలు ప్రారంభమైన రోజునే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమయ్యాయంటే విద్యార్ధులపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఏంటో అర్థమవుతోంది. విద్యార్ధులు, వారు తల్లిదండ్రలు సంతోషంగా ఉంటే జగన్ రెడ్డి & కో మాత్రం కలల్లో నిప్పులు పోసుకుంటున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తుంది. ఒక వైపు అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది.
సూపర్ సిక్స్ అమలులో భాగంగా 90% హామీలను భవిష్యత్తులో అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా
అమలు చేసి మొత్తం హామీలను అమలు చేసి వైసీపీని భూస్థాపితం చేస్తామని ఈ సందర్భంగా
ఉద్ఘాటించారు
సంక్షేమానికి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ అని అమరావతి పోలవరం కూడా నిర్మించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ముల్లంగి రామకృష్ణారెడ్డి మేక వెంకటేశ్వర్లు తాళ్లూరి వెంకటేశ్వర్లు గింజుపల్లి రమేష్ కట్టా వెంకట నరసింహారావు షేక్ అన్వర్ కొటారు ప్రసాద్ ఇన్నమూరి రాజు తదితరులు పాల్గొన్నారు