ప్రజా పాలన..ప్రగతి నివేదిక బస్సు యాత్ర కాదు.. అది విహార ఊరేగింపు యాత్ర

Jun 3, 2026 - 20:29
 0  2

అలంపూర్ నియోజకవర్గంలో ప్రజా పాలన ప్రగతి నివేదిక బస్సుయాత్ర ఎందుకోసం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని  డిమాండ్.

బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

 జోగులాంబ గద్వాల 3జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : అలంపూర్ నియోజకవర్గం ఐజ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ...

ఈ ప్రజా పాలన వలన, రేవంత్ రెడ్డి సర్కార్ వలన అలంపూర్ నియోజకవర్గానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. గత కెసిఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ మూడు సంవత్సరాల లో కాంగ్రెస్ ప్రభుత్వం వరగబెట్టింది ఏమీ లేదు అభివృద్ధి శూన్యం.

ఆర్ గ్యారంటీలు 426 లకు పంగనామాలు పెట్టి ఊరేగుతున్నారు తప్ప ఒక్క హామీ కూడా అమలయ పరిస్థితి లేదుఅని అన్నారు.

 నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని జరగలేదు రోడ్లు సరిగా లేవు, రాజోలి లో జూనియర్ కాలేజీ లేదు, శాంతినగర్ లో జూనియర్ కాలేజీ లేదు

ఐజ లో డిగ్రీ కాలేజీ, బి.ఎడ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, ఐటిఐ కాలేజీ  మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు కాలేజీ వసతి గృహాలు లేవు.

ఆర్డీఎస్ ను మూలకు పడేసినారు మల్లమ్మ కుంట జూలకల్లు వల్ల రిజర్వాయర్లను గాలికి వదిలేసినారు.

 రెండు లక్షల రుణ మాఫీ చేయలేదు..పంటకు బోన్ చెల్లించలేదు..మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టినారు.. మొక్కజొన్నలు, వడ్లు కొనలేని పరిస్థితి... యూరియా బస్తా కూడా సరఫరా చేయలేని దుర్మార్గమైన పరిస్థితి..

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే కూడా పట్టించుకోని పరిస్థితి.

భోగస్ హామీలు...బోగస్ ప్రభుత్వం

 రెండు లక్షల ఉద్యోగాలు బోగస్
 ఫీజు రియంబర్స్మెంట్ బోగస్ 
 విద్యార్థిని లకు స్కూటీలు బోగస్ 
 ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు బోగస్ 
 మెగా డీఎస్సీ బోగస్ 
జాబ్ క్యాలెండర్ బోగస్...

పేదలకు సన్నబియ్యం బోగస్ 
ఉచిత కరెంట్.బోగస్ 
ఉచిత బస్సు ప్రయాణం బోగస్ 
యింటిగ్రేటెడ్ పాఠశాలలు బోగస్ 
ఇందిరమ్మ ఇండ్లు బోగస్ 
కళాశాలల్లో మధ్యాహ్న భోజనం బోగస్ 
ఎస్సీ కార్పొరేషన్ రుణాలు బోగస్ 
వికలాంగులకు ట్రై సైకిళ్లు బోగస్ 
మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు బోగస్ 
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లు బోగస్ 
మహిళలకోసం వడ్డీ లేని రుణాల పెంపు బోగస్ 
మహిళలకు పెద్ద పీట వేయడం బోగస్ 
500 కే గ్యాస్ సిలిండర్ బోగస్ 
రైతు భరోసా బోగస్.

 త్వరలోనే మీరు చేసే విహారయాత్రలకు ప్రజలు చరమగీతం పాడతారని అని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333