ప్రజావాణికి 17 ఫిర్యాదులు:ఎస్పీ శ్రీనివాసరావు

Sep 7, 2026 - 19:59
 0  9
ప్రజావాణికి 17 ఫిర్యాదులు:ఎస్పీ శ్రీనివాసరావు

బాధితుల సమస్యలపై తక్షణ చర్యలు చేపట్టాలి ఎస్పీ.  

 జోగులాంబ గద్వాల 7 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల:- జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్‌ ప్రజల నుంచి 17 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్న ఎస్పీ, సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులతో మాట్లాడి చట్టపరమైన చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.ప్రజల నమ్మకమే పోలీస్‌ శాఖకు ముఖ్యమని, సమస్యలకు ఆలస్యం లేకుండా పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. భూ వివాదాలు, ఆస్తి సమస్యలు, కుటుంబ కలహాలు తదితర అంశాల్లో చట్టపరమైన పరిష్కారం అందిస్తామన్నారు. ప్రజావాణి ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మంగళవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సోమవారం వచ్చిన ఫిర్యాదుల్లో భర్త వేధింపులు ఒకటి, గొడవలు రెండు, భూ వివాదాలు రెండు, కుటుంబ వివాదాలు రెండు, స్థలం ఆక్రమణ ఒకటి, ఇంటి నిర్మాణానికి అడ్డుపడుతున్నారనే ఫిర్యాదు ఒకటి, సీడ్‌ పత్తి విత్తనాల డబ్బులు చెల్లించడంలేదనే ఫిర్యాదులు మూడు, ఇతర సమస్యలకు సంబంధించినవి ఐదు ఉన్నాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333