ప్రజా–పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
అడ్డగూడూరు 30 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యాదాద్రి జిల్లా వైద్యాధికారి డాక్టర్" మనోహర్,జిల్లా రోగనిరోధక అధికారి డాక్టర్"రామకృష్ణ,ఆర్ బిఎస్ కే డాక్టర్"జి శ్రీకాంత్ ఆధ్వర్యంలో అడ్డగూడూరు సాంఘిక సంక్షేమ పాఠశాలలో సోమవారం రోజున స్పెషలిస్ట్ డాక్టర్లచే హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పీడియాట్రీషియన్ డాక్టర్"నవీన్ సింగ్.డెంటల్ డాక్టర్ గాంధీ, డాక్టర్"స్వప్న ఆఫ్తల్మలజిస్ట్,డాక్టర్"సుప్రియ గైనకాలజిస్ట్ ఫార్మసీ ఆఫీసర్ కళ్యాణి,కళాశాల ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి పి.హెచ్.సి అడ్డగూడూరు స్టాఫ్ పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులను పరీక్షించి అవసరమైన మందులను పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థులందరికీ సిపిఆర్ ట్రైనింగ్,ట్రీస్ మేనేజ్మెంట్ గురించి వివరించడం జరిగిందని అన్నారు.