ప్రజాపాలనలోనే గ్రామ అభివృద్ధి సాధ్యం

Jul 15, 2026 - 22:06
Jul 15, 2026 - 23:32
 0  1
ప్రజాపాలనలోనే గ్రామ అభివృద్ధి సాధ్యం

తిరుమలగిరి 16 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తిరుమలగిరి మండలం వెలిశాల మొండి చింత తండ గ్రామాలలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ సహకారంతో 25 లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్ధన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలకు అభివృద్ధి పెద్దపీట వేస్తూ మౌలిక వసతుల కల్పనలో ముందంజలో ఉంది స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్ ప్రత్యేక చొరవతో గ్రామాలకు మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ కృష్ణమూర్తి తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జిమ్మిలాల్ వెలిశాల గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ మొండి చింత తండ సర్పంచ్ శ్రీలత బాలాజీ వెలిశాల ఉపసర్పంచ్ చాలకండ్ల వెంకటమ్మ, మహిళా సంఘం బంధం అధ్యక్షురాలు పులిమామిడి శోభ, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, గ్రామ సిబ్బంది, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి